అలరించిన అన్నమయ్య సంకీర్తనలు

విజ‌య‌న‌గ‌రం : అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ రాజాంకు చెందిన చిన్నారులు హృద్య, కృతిక ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అందరినీ అలరించాయి. ఆదివారం ఉదయం ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో అభయాంజనేయస్వామి సన్నిధిలో అంతయు నీవే హరి, అచ్చుతు శరణమే అన్నిటికిని, అలరులు కురియగ అడెనదే, ఇంతులాల నా వంక తదితర గీతాలను నగేష్‌, కరుణ కుమారి,హృద్య, కృతిక ఆలపించారు.తబలపై చక్రపాణి, వయోలిన్‌పై సాయి సహకారం అందించారు. అనంతరం గాయనీగాయకులకు జ్ఞాపికలతో అభినందించారు.

(Visited 43 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *