సంపత్ పురంలో ఆక్రమణ లను తొలగించిన విఆర్ఒ శ్రీనివాసరావు
అనకాపల్లి :
ఖాలీ జాగా కనిపిస్తే చాలు కళ్లు మూసి తెరిచే సరికి కబ్జా కు గురవుతున్నాయి. తాజాగా అనకాపల్లి మండలం సంపత్ పురం గ్రామంలో సర్వే నెంబరు 72 కొండా పోరంబోకు స్థలాన్ని కశింకోట మండలానికి చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పూరి పాకను నిర్మించడం తో విషయం తెలుసున్న గ్రామస్థులు స్థానిక విఆర్ఒ శ్రీనివాసరావు కి పిర్యాదు చేసారు. దీంతో గ్రామస్థులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమించుకున్న వ్యక్తి వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వెంటనే ఆక్రమణ లను తొలగించారు. అయితే ఆక్రమణ లను తొలగిస్తున్న సమయంలో విఆర్ఒ శ్రీనివాసరావు ని బెదిరించడం చూస్తుంటే ఆక్రమణ దారుడు ఎంతకు బరితెగించాడో అర్దం అవుతుంది. ఈ మేరకు విఆర్ఒ శ్రీనివాసరావు అనకాపల్లి తహసీల్దారు గంగాధర్ దృష్టికి తీసుకువెళ్లారు.