ఉత్సవ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : సబ్ కలెక్టర్ అభిషేక్

(అల్లూరి సీతారామరాజు జిల్లా)

చింతపల్లి :

నేటి నుంచి 30 వరకు నిర్వహించ తలపెట్టిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు పాడేరు సబ్ కలెక్టర్ వి అభిషేక్, స్థానిక ఏఎస్ పి తుషార్ డూడి పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్ లు మంగళవారం ఈనెల 27 నుంచి 30 వరకు జరుగు ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం యొక్క ఏర్పాట్ల పరిశీలించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణ నీటి సరఫరాల విభాగం, విద్యుత్ శాఖ, ఐసిడిఎస్, వెలుగు, రెవెన్యూ,వైద్య ఆరోగ్య, పోలీస్, రోడ్లు భవనాల మొదలగు శాఖల అధికారులు, జడ్పీటీసీ, సర్పంచ్, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం
ముత్యాలమ్మ తల్లి గుడి, సతకం పట్టు, పార్కింగ్, ఎగ్జిబిషన్ ప్రదేశాలు, బాణాసంచా వెలిగించు ప్రదేశాలు, బర్త్ విశ్రాంతి ప్రదేశాల తో పాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, స్టాల్స్, వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటయ్యే ప్రదేశాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ శాఖల పనితీరు సిబ్బందికి తగు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమమాలలో సిఐ శ్రీను, తహశీల్దార్ గోపాలకృష్ణ, సిహెచ్ సి సూపరింటెండెంట్ ఉమా మహేశ్వరరావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఏఈఈ గడుతూరి స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యులు పోతురాజు బాలయ్య, గ్రామ సర్పంచ్ దురియా పుష్పలత, డిప్యూటీ తహశీల్దార్ శ్రీను బాబు, ఈఓఆర్డీ కొరుప్రోలు శ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బేతాళుడు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

(Visited 5 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *