రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు “దహనం” చిత్రం ఎంపిక

అనకాపల్లి, వి.డ్రీమ్స్‌:

చలనచిత్ర దర్శకులు ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ నిర్మాతగా

హీరో ఓం ఆదిత్య నటించిన ‘‘దహనం’’ చిత్రానికి రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కి ఎంపికయింది. ఆడారి మూర్తిసాయి తీసిన ‘‘దహనం’’ చిత్రం ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ఎంపికవడం హర్షనీయమని అనకాపల్లి లాఫింగ్‌ క్లబ్‌ అధ్యక్షులు మళ్ళ సురేంద్ర, పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మళ్ల సురేంద్ర స్వగృహంలో దర్శకులు ఆడారి మూర్తిసాయి తోపాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఎఫ్‌ఎమ్‌ బాబాయ్‌ ని మళ్ళ సురేంద్ర ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ దర్శకులు ఆడారి మూర్తి సాయి మొదటిసారి దర్శకత్వం వహించిన చిత్రం రాజస్థాన్‌ ఫిలింఫేర్‌ కి ఎంపిక కావడం చాలా సంతోషకరమైన, గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తుతం ఆడారి మూర్తిసాయి దర్శకత్తంలో రూపొందుతున్న రెండో చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పిట్ల రాజు, దాడి జగన్‌, గోల్డ్‌ వాసు, సిహెచ్‌ అవతార్‌ (అవ్వ), సాయిరాజ్‌, ప్రసాద్‌, దొర, ఎండకుర్తి అప్పలరాజు, బుద్ధ జోగినాయుడు, జొన్నాడ సురేష్‌, ఎస్‌.భాను చందర్‌ అఖి, చందు తదితరులు పాల్గొన్నారు.

(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *