గాయపడిన బాలుడికి ఆర్థిక సాయం
చింతపల్లి :ఈ నెల 4 న, మండలంలోని మడిగుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,చౌడుపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఆరోగ్య సహాయకుడుగా పని చేస్తున్న మాదబత్తుల రవి కుమార్ ద్విచక్ర వాహనంతో బారి వాహనానికి డీ కొన్న సంఘటనలో రవి కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు గీతం సాయి తేజ తలకు తీవ్ర గాయమవడంతో విశాఖలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రవికుమార్ మృతితో కుటుంబం చిన్న భిన్నమైందని, గీతం సాయి తేజ చికిత్స నిమిత్తం ఇప్పటికే అనేక వర్గాలకు చెందివారు ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికి గురువారం మండలంలోని చౌడుపల్లి గ్రామంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు ఉద్యోగస్తులు, యువకులు విరాళాలు సేకరించి రూ.71,750 లు గీతం సాయి తేజ తల్లికి అందజేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కోరాబు కరుణానిధి,గుత్తేదారుడు కొంటా బాలక్రిష్ణ,ఉపాధ్యాయుడు సరిమండ తిలక్,యువకులు గంపరాయి విజయ కుమార్,ఉగ్రంగి రవి ప్రసాద్,లోచల కిరణ్, దేపూరు వినీత్,కోరాబు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.