స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
నలుగురికి గాయాలు
విశాఖ .(ఉక్కునగరం) : స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ షాపు (ఎస్ఎంఎస్ -2)లో అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాడెల్ హుక్ తెగి పడి ఇనుము ద్రావకం నేలపాలకావడంతోఅక్కడే విధులు నిర్వహిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు కాగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. కాగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను విశాఖ స్టీల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కోరాడ మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, ఎస్. శోభన్‌బాబు, కె. పైడింనాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిని శోభన్‌బాబును ఈఎస్ఐ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. స్టీల్‌ప్లాంట్ హెచ్‌వోడీ కేహెచ్ ప్రకాశరావు సంఘటనపై ఆరా తీశారు. సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ తెగిపడడంతో ప్రమాదం జరిగింది.