ఏయూలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్స్
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డిటెక్స్, కాలేజీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీలో బి.ఎస్సీ(హానర్స్) మరియు ఎం. ఎస్సీలో పీజీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థు లు రిజిస్ట్రార్,ఆంధ్రాయూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, మరియు అడ్మిషన్ అకౌంట్ పేరు మీద రెండు వేల రూపాయలు డిడిని ఏదైనా జాతీయ బ్యాంకులో తీసుకోవాలి. 600 రూపాయ లు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి.ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులతోనూ రిజర్వేషన్ కేటగిరీలో అయితే 45 శాతం మార్కులతోనూ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులు పెదవాల్టర్ సమీపంలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్,విజయనగర్ ప్యాలస్, పెదవాల్టైర్ విశాఖపట్నంకు పంపు కోవాలి.ఈనెల ఏడో తేదీలోగా దరఖాస్తులు చేరాలి. పదవ తేదీ ఉదయం 10 గంటలకు అభ్యర్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలి.ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు,డిప్లమా, బ్యాచిలర్, హానర్స్,మాస్టర్ డిగ్రీలను ప్రవేశపెట్టారు ఈ కోర్సులో 40 సీట్లు ఉన్నాయి.ఈడబ్ల్యూఎస్ మరో 4 సీట్లు కేటాయించారు రూ 65000ఫీజుగా నిర్ధారించారు.