కోడూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

అనకాపల్లి  :

 

మండలం లోని కోడూరు గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సేనాపతి లక్ష్మి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ‌ సందర్భంగా సుమారుగా 60/మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేసారు. గ్రామం చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకున్నారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సేనాపతి లక్ష్మి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తున్నామని అన్నారు. స్దానిక మంత్రి గుడివాడ అమర్నాధ్ సూచనలతో అనకాపల్లి ఎంపిపి గొర్లి సూరిబాబు ప్రోత్సాహంతో గ్రామం లో వైద్య శిబిరాలను నిర్వహిం గలుగుతున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాధ్ కి,ఎంపిపి సూరిబాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరి సహకారంతో గ్రామం అభివృద్ధి చెయ్యగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. కె.పైడి రాజు, కె. పెంట రావు, విఆర్ఒ సూర్యనారాయణ ఆశా వర్కర్లు లావణ్య,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

 

(Visited 42 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *