ఈ నెల 28 న అనకాపల్లిలో జియో కన్సల్టెన్సీ ప్రారంభం : డాక్టర్ రావు
అనకాపల్లి :
ఈ నెల 28న అనకాపల్లిలో రాఘవేంద్ర జియో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ప్రారంబించ నున్నట్లు గనులు భూగర్భ విశ్రాంతి ఉద్యోగి డాక్టర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అనకాప
ల్లి చదువుల వారి వీధిలో ఈ కన్సల్టెన్సీ ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనకాపల్లిలో మైనింగ్ ఎక్కువుగా ఉన్నాయని మైనింగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మా కన్సల్టెన్సీ ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. మైనింగ్, సర్వే,ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్ సర్వే, జియాలజీ, అనాలిటికల్ తో పాటు ఎన్విరాన్మెంట్ లో ప్రతిభావంతులైన నిపుణులతో కన్సల్టెన్సీ సేవలను అందిస్తుందని డాక్టర్ రావు తెలిపారు. అంతేకాకుండా ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ ద్వారా కూడా సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించే దిశగా మా కన్సల్టెన్సీ ముందుకు వెళ్తాదని ఆయన తెలిపారు. ఈనెల 28 న శ్రీ రాఘవేంద్ర జియో కన్సల్టెన్సీ పేరుతో ప్రారంబిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించి ఎవరైనా మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే 9866065840,9493593399,అలాగే 7844887799 వాట్సాప్ నెంబరు కి సంప్రదించవచ్చు అని అయన అన్నారు.