కోవిడ్ నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం


కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాలతో ఓవైపు ప్రజల కొనుగోలు శక్తి హరించుకు పోతుంటే మరోవైపు దేశంలో ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోతుందని శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను బాదుడు విధానాలతో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా రోజురోజుకి పెరగడంతో ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో టోకు ధరలు సూఛీ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా 10.49 శాతానికి పెరిగిందని మూడి చమురు నూనెలు కమాడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రెండంకెల ఎగబాకిందని జగదీష్ తెలిపారు. ఇంతక్రితం మార్చిలో సూచి( డబ్ల్యూపిఐ) 7.39 శాతంగా నమోదైందని గడిచిన ఏప్రిల్లో ఆహార ఉత్పత్తులు ధరలో 4.92 శాతానికి తగ్గడం ఉపశమనం కలిగించే అంశం అని తయారీ ఉత్పత్తుల ధరలు 9.01 శాతం పెరిగిందని విద్యుత్తు పెట్రోల్ డీజిల్ ధరలు ఏకంగా 21 శాతం పెరిగాయని జగదీష్ తెలిపారు. పప్పులు పళ్ళు, 10.74 గుడ్డు,మాసం,27.43 శాతం మరియు చేపల ధరలు వరసగా 10.88 శాతం పెరిగాయని నాగ జగదీష్ తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్లో రిటైర్ వినియోగదారులు ద్రవ్యోల్బణ 4.29 శాతానికి తగ్గిందని ఇంతక్రితం మార్చిలో ఈ ద్రవ్యోల్భణం 5.52 శాతం పెరిగి నాలుగు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదైందని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నాగ జగదీష్ డిమాండ్ చేశారు.

(Visited 87 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *