మాటల మాంత్రికుడు గణేష్ పాత్రో
(జనవరి 5న గణేష్ పాత్రో వర్థంతి)
మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ, నాటక రచయిత, గణేష్ పాత్రో పూర్తిపేరు బెహరా సత్య గణ గంగ వెంకటరమణ మహాపాత్రో. ఆయన 1945 జూన్ 22వ తేదీన పార్వతీపురంలో జన్మించారు. తండ్రి బెహరా ఆదిలక్ష్మీనారాయణపాత్రో, తల్లి సూర్యకాంతం. పాత్రో ఉన్నత విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. పియుసి పూర్తిచేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. ఆంధ్రా యూనివర్సిటీ సాంస్క ృతిక విభాగానికి జాయింట్ సెక్రటరీగా వ్యవహరించడమే గాక నాటకాలు రాయడం వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం చురుగ్గా సాగించారు.పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసారు.
ప్రఖ్యాత రంగస్థల నటులు కె వెంకటేశ్వరరావు గారి కుమార్తె లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఓలేటి బుచ్చిబాబు అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని నాటకరంగంలో ఎన్నో విజయాలను సాధించారు.తొలిరోజుల్లో గణేష్ పాత్రో రాసిన మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య అనే నాటకాలు, కొడుకు పుట్టాల, లాభం, పావలా, ఆగండి కొంచెం ఆలోచించండి, త్రివేణి తదితర నాటికలు రాసారు. తరంగాలు, అసురసంధ్య వంటి గొప్ప నాటకాలు రాసారు. పావలా నాటికలో ప్రధాన పోషించిన శ్యామల సినిమాల్లోకి వెళ్ళినా పావలా శ్యామలగా నిలిచిపోయింది. కొడుకు పుట్టాల అనే నాటకం ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి. ఆ నాటకం దేశవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడింది.ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కూడా ప్రసారితమైంది. పరాజితుడు అనే ఏకపాత్రాభినయాన్ని రాసుకుని అద్భుతంగా అభినయించారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో థియేటర్ ఆర్ట్ ్స విభాగపు అధిపతి కుప్పిలి వెంకటేశ్వరరావు వద్ద శిష్యరికం చేసారు.1975లో జయప్రద మూవీస్ పతాకంపై లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో కృష్ణరరాజు హీరోగా విడుదలైన నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాకు పాత్రో కథ, సంభాషణలు రాసారు.1976 జూన్ 10న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో రామకృష్ణ హీరోగా విడుదలైన అల్లుడొచ్చాడు చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణతో కలసి పాత్రో సంభాషణలు రాసారు.1976లో కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో విడుదలైన అత్తవారిల్లు చిత్రంకు గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1977 ఆగస్టు 13న గోపీకృష్ణా ఇంటర్నేషనల్ పతాకంపై ఈరంకి శర్మ దర్శకత్వంలో నారాయణరావు, రజనీకాంత్, సంగీత నటించిన చిలకమ్మ చెప్పింది చిత్రానికి పాత్రో మాటలు రాసారు.
1977 నవంబర్ 17న సృజనా కంబైన్స్ పతాకంపై కె ఎస్ రామిరెడ్డి దర్శకత్వంలో మురళీమోహన్, రజనీకాంత్ నటించిన తొలిరేయి గడిచింది చిత్రానికి కథను ఎబి జగన్మోహనరావు, ఎండి సుందర్‌లతో కలసి పాత్రో కథ, సంభాషణలు రాసారు.1978 మే 8న ఆర్ కె ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈరంకి శర్మ దర్శకత్వంలో నారాయణరావు, రూప నటించిన నాలాగ ఎందరో చిత్రానికి కథ, మాటలు పాత్రో రాసారు.1978 మే 19న కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన మరో చరిత్ర చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1979 ఏప్రిల్ 19న ప్రేమాలయ సంస్థ పతాకంపై కె బాలచందర్ దర్శకత్వం వహించిన అందమైన అనుభవం చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1979 జూన్ 27న కె బాలచరదర్ దర్శకత్వంలో విడుదలైన ఇదికథకాదు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.
తమిళంలో విడుదలైన అవర్ గళ్ అనే చిత్రాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీసారు. ఈ సినిమాకు గాను జయసుధకు ఉత్తమ నటికి నంది అవార్డు లభించింది. ఈ చిత్రంలో చిరంజీవి ప్రతినాయకుడిగా నటించారు.1979 నవంబర్ 2న కళాకేంద్ర మూవీస్ పతాకంపై బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన గుప్పెడు మనసు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు. 1981లో కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన తొలికోడి కూసింది చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1981 జనవరి 9న ప్రేమాలయ పతాకంపై కమలహాసన్ హీరోగా నటించగా కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ఆకలిరాజ్యం చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.
1981 జనవరి 15న భరత్ ఫిలింస్ పతాకంపై కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించగా కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1981లో ప్రేమాలయా పతాకంపై చిరంజీవి, జయప్రద జంటగా నటించగా కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన 47 రోజులు అనే చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు. 1981లో రజనీకాంత్, మాధవి జంటగా కె బాలంచదర్ దర్శకత్వంలో విడుదలైన మీసం కోసం అనే చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.
1981లో కె బాలచందర్ దర్శకత్వంలో సరిత ప్రధాన పాత్రలో విడుదలైన దాహం దాహం చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1983 నవంబర్ 25న విజయచిత్రా పిక్చర్స్ పతాకంపై వేజెళ్ల సత్యనారాయణ దర్శకత్వం వహించగా విడుదలైన ఆడవాళ్లే అలిగితే చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1983లో లక్ష్మీజ్యోతి పిక్చర్స్ పతాకంపై సరిత ప్రధాన పాత్రలో కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన కోకిలమ్మ చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1983లో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై భానుచందర్, సుహాసిని జంటగా నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ముక్కు పుడక చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1984 జూన్ 7న బాలకృష్ణ హీరోగా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన డిస్కో కింగ్ చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.
1984 సెప్టెంబర్7న బాలకృష్ణ హీరోగా నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మంగమ్మగారి మనవడు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1984లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మనిషికో చరిత్రలో సంభాషణలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ చిత్రంలో గొల్లడపూడి నటనకు, పాత్రో సంభాషణలకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.1984 ఆగస్టు 15న ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మయూరి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాత్రో సంభాషణలు రాసారు. ఈ సినిమాకు గాను సుధాచంద్రన్‌కు ఉత్తమనటిగా జాతీయ అవార్డు, నంది అవార్డు రాగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది.
1984లో క్రాంతి చిత్ర పతాకంపై సుహాసిని ప్రధాన పాత్రలో క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన స్వాతి చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1985 జనవరి 16న సుహాసిని ప్రధాన పాత్రలో క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన స్రవంతి చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1985 ఏప్రిల్ 9న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్, పూర్ణిమ జంటగా నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మా పల్లెలో గోపాలుడు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1985 మే 3న జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజాచంద్ర దర్శకత్వంలో విడుదలైన ఓ తండ్రి తీర్పు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1985 జూలై 19న రాజాచంద్ర దర్శకత్వంలో విడుదలైన ముగ్గురు మిత్రులు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.
1985లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా వంశీ దర్శకత్వం వహించిన ప్రేమించు-పెళ్లాడు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1986 జనవరి 9న శోభన్‌బాబు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన శ్రావణ సంధ్య చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1986 జనవరి 10న రాజాచంద్ర దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా విడుదలైన మిస్టర్ భరత్ చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1986 ఫిబ్రవరి 28న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ముద్దుల కృష్ణయ్య చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు. 1986 అక్టోబర్ 30న మురళీమోహన్ హీరోగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన శ్రావణమేఘాలు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.
1986లో అర్జున్ హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మన్నెంలో మొనగాడు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1986 డిసెంబర్ 29న నాగార్జున హీరోగా క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన అరణ్యకాండ చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1987 జనవరి 14న ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో విడుదలైన సంసారం ఒక చదరంగం సినిమాకు గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1987 ఏప్రిల్ 8న ఎస్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున నటించగా బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన కలెక్టర్ గారి అబ్బాయి చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1987 మే 1న సుమన్ హీరోగా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన ధర్మపత్ని చిత్రానికి సంభాషణలను పాత్రో రాసారు.
1987 మే 19న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మువ్వగోపాలుడు చిత్రానికి గణేష్ పాత్రో సంభాషణలు రాసారు.1987 జూన్ 5న చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన చక్రవర్తి సినిమాకు పాత్రో సంభాషణలు రాసారు.1987 ఆగస్టు 15న రాధా మాధవి ఫిలింస్ పతాకంపై క్రాంతికుమార్ దర్శకత్వంలో సుహాసిని ప్రధాన పాత్రలో విడుదలైన గౌతమి చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1987లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన తలంబ్రాలు చిత్రానికి సంభాషణలను పాత్రో రాసారు.1988లో రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఆహుతి చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1988 మార్చి 2న ఆర్ జె ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రావుగోపాలరావు నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన స్టేషన్ మాస్టర్ చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.
1988 మార్చి 4న కె బాలచందర్ స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించగా చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు. ఉత్తమ జాతీయ సమైక్యతకు సంబంధించి ఉత్తమ చిత్రంగా రుద్రవీణ సినిమాకు, ఉత్తమ నటుడుగా చిరంజీవికి నంది జూరీ పురస్కారం, ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకు జాతీయ పురస్కారము, ఉత్తమ గాయకుడిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు జాతీయ పురస్కారం ఈసినిమా ద్వారా లభించాయి.1988 మే 31న నాగార్జున హీరోగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన మురళీ కృష్ణుడు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1989 మే7న బాలకృష్ణ హీరోగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ముద్దుల మావయ్య చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1989లో నాగార్జున హీరోగా కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన విక్కీదాదా చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు. యండమూరి వీరేంద్రనాథ్ కథను రాయగా పరుచూరి బ్రదర్స్ స్క్రీన్‌ప్లే చేసారు.1990లో శ్రీలత ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్ నటించగా ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో విడుదలైన గురు శిష్యులు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.
1990 జూలై 7న బాలకృష్ణ హీరోగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా విడుదలైన ముద్దుల మేనల్లుడు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1990 సెప్టెంబర్ 5న అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున నటించగా అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఇద్దరూ ఇద్దరే చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1990లో బి.సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన పుట్టింటి పట్టుచీర చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.1991 జనవరి 11న క్రాంతికుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రధాన పాత్రలో విడుదలైన సీతారామయ్యగారి మనవరాలు చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ దర్శకునిగా క్రాంతికుమార్‌కు, ఉత్తమ నటుడిగా అక్కినేనికి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రంగాను. ఉత్తమ నటిగా మీనాకు, ఉత్తమ గాయనిగా చిత్రకు, ఉత్తమ దర్శకునిగా క్రాంతికుమార్‌కు నంది అవార్డులు దక్కాయి.1991లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన అమ్మ అనే చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన అమ్మ రాజీనామా చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1991లో అశ్వినీ నాచప్ప ప్రధానపాత్రలో మౌళి దర్శకత్వంలో విడుదలైన అశ్విని చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.
1991లో ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో విడుదలైన జీవనచదరంగం చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1991ఫిబ్రవరి 21న జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళీమోహన్ నిర్మించగా ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించగా సూపర్‌హిట్‌గా నిలిచిన నిర్ణయం సినిమాకు పాత్రో సంభాషణలు రాయడమే గాక హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం అంటూ ఒక పాటను కూడా రాసారు.1991 జూన్ 21న కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మధురానగరిలో చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1992 ఫిబ్రవరి 24న విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై దొరైస్వామిరాజు నిర్మించగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన మాధవయ్యగారి మనవడు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1992 మే 15న జయభేరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన పెళ్లాం చెబితే వినాలి చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1992 ఆగస్టు 20న క్రాంతికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్, సుహాసిని జంటగా నటించిన అక్కమొగుడు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.
1992 ఆగస్టు 23న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన అల్లరి పిల్ల చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1992లో గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లు రామలింగయ్య నిర్మించగా కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో విడుదలైన డబ్బు భలే జబ్బు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1993లో సంతాన భారతి దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించిన మహానది చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1993 అక్టోబర్ 16న దుర్గాఫిలింస్ పతాకంపై కె ఋష్యేంద్రరెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలిముద్దు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1994లో విజేత ఫిలింస్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వినీత్, రంభ జంటగా నటించగా విడుదలైన సరిగమలు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1994 జూన్ 22న ఎఎన్‌ఆర్ ఆర్ట్ ్సపతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించగా ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తీర్పు అనే చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.
1995జూలై 28న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మాతో పెట్టుకోకు చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1997లో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన రథయాత్ర చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.1999 సెప్టెంబర్ 23న భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మా బాలాజీ చిత్రానికి గణేష్‌పాత్రో సంభాషణలు రాసారు.2001 జనవరి 11న శ్రీ సాయీ క్రియేషన్స్ పతాకంపై సౌందర్య ప్రధాన పాత్రలో క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన 9నెలలు అనే చిత్రానికి పాత్రో సంభాషణలు రాసారు.
2013 జనవరి 11న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు, వెంకటేష్ హీరోలుగా నటించగా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రానికి శ్రీకాంత్ అడ్డాలతో కలసి పాత్రో సంభాషణలు రాసారు. గణేష్‌పాత్రోను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ నటుడు డాక్టర్ ప్రభాకరరెడ్డికే దక్కుతుంది. ఆయన చిలకమ్మ చెప్పింది, ఆకలి రాజ్యం చిత్రాల్లో నటించారు. మరోచరిత్ర, అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇదికథకాదు, ఆకలిరాజ్యం,కోకిలమ్మ, మంగమ్మగారి మనవడు, మనిషికో చరిత్ర, మయూరి, స్వాతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు సంభాషణలు రాసి సెభాష్ అనిపించుకున్న పాత్రో 2015 జనవరి 5వ తేదీన తన నిజ జీవిత పాత్రకు ముగింపు పలికారు.విజయనగరం జిల్లా పార్వతీపురంలో బైపాస్ రోడ్డుకు గణేష్‌పాత్రో పేరును పెట్టారు.