అరేవో! సోనూ భాయ్
కడుపు నిండా తిండి తినని రోజులు..నీళ్లు తాగి నడిచిన రోజులు.. చెప్పులు తెగి కాళ్లరిగేలా నడిచిన రోజులు.. పాదాలు చిట్లి రక్తపు ధారతో పరుగులు తీసిన రోజులు..ఇళ్లకు చేరగలమా అన్న సందేహించిన రోజులు..ఇవన్నీ ఒక్కడినే కదిలించాయి..పట్టెడన్నం పెట్టమని ఉపదేశించాయి. వలస కూలీలకు అన్నం వలస కూలీల కళ్లల్లో ఆనందం అన్నీ తానే..అతడే సోనూ సూద్.. నేను మీకు కాస్త సాయం చేసే అవకాశం నాకు దక్కింది అది అదృష్టం నాలో ఏమీ లేదు..మీరంతా మీ మీ గమ్య స్థానాలకు చేరి నాతో మా ట్లాడండి ముంబయ్ దారుల్లో ఇదే చెప్పాడు. ఆస్తులు తాకట్టు పెట్టి సాయం చేశాడు. ఆయన సేవ ఎందరినో కదిలించింది. మారు మూల శ్రీకాకుళం పల్లెలలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అందుకే కోటబొమ్మాళి మండలం, ఎత్తురాళ్ల పాడు జాతీయ రహదారికి సమీపాన ఓ ఫ్యామిలీ ధాబా ఆయన పేరుతోనే ప్రారంభం అయింంది. ఆయన స్ఫూర్తితో సేవకు తాము సిద్ధం అని ఆ ధాబా యజమాని చెబుతున్నారు. రండి సోనూ సూద్ స్ఫూర్తితో ఇంకొందరిని ఆదుకుందాం. అన్నట్లు ఈ సోనూసూద్ ఫ్యామిలీ ధా బాను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు ఇటీవలే ప్రారంభించారు. మనసున్న మారాజు సోనూ సూద్ కు ఇంకొందరు అభిమా నులు ఉన్నారు. వారంతా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. నటులంతా ఆర్థిక పురోగతి కోరుకుంటుంటే సా మాజిక పురోగతే సిసలైన ప్రగతి అని నమ్మే సోనూ సూద్ ఇప్పటి ఆదర్శం. ఎప్పటికీ ఆయన పేరు చిరస్మరణీయం.