జీవీఎంసీ కమిషనర్ గా నాగలక్ష్మి

విశాఖపట్నం : మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆమె ఈపీడీసీఎల్ సిఎండిగా పని చేశారు.జివిఎంసి ఎన్నికల నేపథ్యంలోఇక్కడ కమీషనర్గా పనిచేస్తున్న డాక్టర్ జి. సృజనను బదిలీ చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పద్యంలో నాగలక్ష్మి ని కమిషనర్గా నియమించింది.సృజన గత వారం రోజులుగా సెలవులో ఉండడంతో విఎంఆర్డిఎ కమిషనర్ కోటేశ్వరరావు ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి కమిషనర్ అవసరమని భావించిన నేపద్యంలో నాగలక్ష్మిని కమిషనర్ గా నియమించారు. గురువారం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాక అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

(Visited 168 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *