విలువ‌ల తేజం అదితి

ఉపాధ్యాయినిగా ప్రస్థానం ప్రారంభించి ప్రజల గుండెల్లో

సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ అదితి గజపతిరాజు

(నవంబర్‌ 24న అదితి గజపతిరాజు జన్మదినం సందర్భంగా ‌VDREAMS ప్రత్యేకంగా అందిస్తున్న కథనం)

గురువుకు సమాజంలో ఉన్నతమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి పవిత్రమైన ఉపాధ్యాయవృత్తి నుండి రాజకీయాల్లోకి అదితి ప్రవేశించారు. ఆమె పూర్తిపేరు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు. ఉన్నత విద్యావంతురాలైన అదితి 1982 నవంబర్‌ 24వ తేదీన జన్మించారు. ప్రాథ‌మిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని విద్యారణ్య పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్ ఏ ఎస్ ఆర్ విద్యాసంస్థల యందు ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు.

హైదరాబాద్‌ బేగంపేటలో గల సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఉపాధ్యాయవృత్తిపట్ల గౌరవము, అంకితభావం కలిగిన ఆమె మాంటిస్సోరి విద్యావిధానంపై శిక్షణకూడా తీసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో మాస్టర్‌ డిగ్రీ సాధించారు. ఆమె కొంత కాలం మద్రాసులోను, అబుదాబి లోను ఉపాధ్యాయినిగా సేవలందించారు. రాజకీయాల్లో నిజాయితీకి నిలువుటద్దంగా పేర్గాంచిన పూసపాటి అశోకగజపతిరాజుకు వారసురాలుగా అడుగులు వేయడమే గాక అందరినీ కలుపుకువెళతారని, అందుబాటులో ఉంటారనే పేరును సంపాదించారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి శాసనభకు పోటీచేసారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని పొందినా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.2017 సెప్టెంబర్‌ 18వ తేదీన ప్రధాని నరేంద్రమోదీపై ప్రత్యేకంగా రూపొందించబడిన మై స్టాంప్‌ను అలయన్స్‌క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 105 ఆధ్వర్యంలో అశోక్‌గజపతిరాజుతో కలసి అదితి ఆవిష్కరించారు.2019 సెప్టెంబర్‌ 28న విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్‌ రాసిన భారత క్రికెట్‌ రథసారధులు అనే పుస్తకాన్ని భారత జాతీయ క్రికెట్‌ జట్టు ఛీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌తో కలసి అదితి గజపతిరాజు ఆవిష్కరించారు.

1958 నవంబర్‌ 12న స్థాపించిబడిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్‌ ్స అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌)కు ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్‌ విద్యాసంస్థల యందు 650 కిలోవాట్ల శక్తిసామర్థ్యం కలిగిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడంలో కీలకపాత్రను పోషించారు. నిరుపేద విద్యార్ధుల కోసం సింహాచలం దేవస్థానం ద్వారా గతంలో ప్రతీరోజూ 150 మంది విద్యార్ధులకు ఉచితంగా భోజన వసతి కల్పించేవారు. అదితి గజపతి సూచనల మేరకు ఆ సౌకర్యాన్ని 450 మంది విద్యార్ధులకు అందేలా చేసారు. వేలాదిమంది విద్యార్ధులుకు ఉచిత భోజనవసతి విషయంలో కూడా ఆమె చురుకైన పాత్రను పోషించారు

(Visited 24 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *