పేదలకు సేవ చేస్తా…
పుట్టిన రోజు వేడుకల్లో దిల్ రాజు
ప్రఖ్యాత నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ జన్మదిన వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సినీ ప్రముఖులు, స్నేహితులు, బంధువుల మధ్య ఆడంబరంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినీ రంగంలో అడుగుపెట్టి పాతికేళ్లు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ 25 సంవత్సరాలలో ఎక్కువ శాతం విజయవంతమైన కెరీర్ను కొనసాగించడం వెనుక అందరి సహకారం ఉందన్నారు. పేరు, డబ్బు ఎంతో సంపాదించాం..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సేవా రంగంవైపు పయనించాలని ఈ పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయించుకున్నా…మీ అందరి సహకారం ఉంటే మరింత మందికి సేవ చేయగలుగుతా..మీడియా సపోర్ట్ ఉంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న సమస్యలు తెలుస్తాయి. మీలో ఎవరైనా సేవ చేయాలనుకుంటే రండి…కలిసి పనిచేద్దామని జర్నలిస్టలనుద్దేశించి అన్నారు. ఆరోగ్యం. చదువు కోసం సాయం చేయాలని నిర్ణయించుకున్నా అని దిల్ రాజు తన బర్త్డే వేడుకలనుద్దేశించి ప్రసంగించారు.