ఉత్తమ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు మురళీ మనోహర్‌ జోషి

(జనవరి 5న భారతీయ జనతాపార్టీ పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్‌ జోషి జన్మదినం)

మురళీ మనోహర్‌ జోషి 1934 జనవరి 5వతేదీన ఆల్మోరాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం బిజ్నోర్‌ జిల్లా చాంద్‌పూర్‌లోను, అల్మోరాలోను సాగింది. మీరట్‌ కళాశాలలో బి.ఎస్సీ పూర్తిచేసారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయడంతో పాటు డాక్టరేట్‌ కూడా సాధించారు. ఎలక్ట్రో మేగ్నటిక్‌ రేడియేషన్‌పై పి.హెచ్‌డి చేసారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రాన్ని బోధించారు. 1953-54 సంవత్సరాల మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. గో సంరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. 1955లో ఉత్తరప్రదేశ్‌లో కుంభ్‌ కిసాన్‌ ఆందోళన్‌లో పాల్గొన్నారు. ఎమర్జన్సీ సమయంలో 1975 జూన్‌ 26 నుండి 1977 వరకు జైలుశిక్ష అనుభవించారు. 1977లో ఉత్తరాఖండ్‌లోని ఆల్మీరా నియోజక వర్గం నుండి భారతీయ లోక్‌దళ్‌ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1,53,409 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నరేంద్రసింగ్‌ బిష్ట్‌కు 75,933 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో జోషి 77,476 ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. జనతాపార్టీ ఆవిర్భావం తరువాత పార్టీకి పార్లమెంటరీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలను చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా కూడా సేవలందించారు.

1992 జూలై 5వ తేదీనుండి 1996 మే 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్‌ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జోషికి 2,16,844 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, జనతాదళ్‌ పార్టీ అభ్యర్ధి సరోజ్‌ దూబేకు 1,13,321 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో జోషి 1,03,523 ఓట్ల భారీ మెజార్టీతో రెండవమారు పార్లమెంటులోకి అడుగుపెట్టారు.1996 మే 19వ తేదీనుండి జూన్‌ 1వ తేదీ వరకు కేంద్ర హోంశాఖామాత్యులుగా బాధ్యతలను నిర్వర్తించారు.1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మరోమారు అలహాబాద్‌ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జోషికి 265,232 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి శ్యామాచరణ్‌ గుప్తాకు 2,21,942 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో జోషి 43,290 ఓట్ల మెజార్టీతో మూడవమారు పార్లమెంటులోకి అడుగుపెట్టారు. 1998 మే 19వ తేదీ నుండి 2004 మే 22వ తేదీ వరకు కేంద్ర మానవవనరుల శాఖా మాత్యులుగా వ్యవహరించారు.1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడవమారు అలహాబాద్‌ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జోషికి 2,19,114 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి కున్వర్‌ రేవతీ రమణ్‌సింగ్‌కు 1,48,783 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో జోషి70,331 ఓట్ల భారీ మెజార్టీతో నాల్గవ మారు పార్లమెంటులోకి అడుగుపెట్టారు.1999 మే 19వ తేదీనుండి 2004 మే 22 వరకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖామాత్యులుగా సేవలందించారు.2004లో జరిగిన ఎన్నికల్లో నాల్గవ మారు అలహాబాద్‌ నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి తొలిసారి ఓటమిపాలయ్యారు.

ఈ ఎన్నికల్లో మురళీమనోహర్‌ జోషికి 2,05,625 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి కున్వర్‌ రేవతీ రమణ్‌సింగ్‌కు 2,34,008 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో మురళీ మనోహర్‌ జోషి 28,383 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీచేసి విజయకేతనం ఎగురవేసారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 2,03,122 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి ముక్తార్‌ అన్సారీకి 1,85,911 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మురళీమనోహర్‌ జోషి 17,211 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో తొలిసారి కాన్పూర్‌ నియోజకవర్గం నుండి పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మురళీమనోహర్‌ జోషికి 4,74,712 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ ప్రకాష్‌ జైశ్వాల్‌కు 2,51,766 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో మురళీమనోహర్‌ జోషికి 2,22,946 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది.1991 నుండి 1993 వరకు భారతీయ జనతాపార్టీకి జాతీయ అధ్యక్షులుగా సేవలందించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం గావించింది.

(Visited 31 times, 1 visits today)

2 thoughts on “ఉత్తమ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు మురళీ మనోహర్‌ జోషి

  • January 5, 2021 at 9:00 am
    Permalink

    Save temples, save Hinduism, kai hind jai Bharat.

    Reply

Leave a Reply

Your email address will not be published.