చేతులు లేక‌పోయినా జేజేలు

చేతులు లేవ‌ని ఆమె కుంగిపోలేదు..ఎందుకు బ‌తికిబ‌య‌ట ప‌డ్డాన‌ని ఆందోళ‌న చెంద‌లేదు. తోటివారంతా ఆడుతూపాడుతూ ఉంటే అది చూసి మాన‌సిక వేద‌న అనుభ‌వించ‌లేదు. 16 ఏళ్ల ప్రాయంలోనే 45 శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకుని మృత్యువుతో పోరాడింది. ఆమె ఆత్మ‌స్థైర్యానికి ఆ విధి సైతం త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. మ‌న‌సుకు న‌చ్చిన వాడ‌ని మనువాడి…రెండు చేతులు లేక‌పోయినా వ్యాపార రంగంలో ప్ర‌తిభ చాటుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తోంది. ఆమె ముంబైకి చెందిన పౌలామి పటేల్.


2001లో పౌలామి వేస‌వి సెల‌వుల్లో హైద‌రాబాద్‌లో ఉంటున్న త‌న బంధువుల ఇంటికి వ‌చ్చింది. పిల్ల‌లంతా క‌లిసి చేప‌లు ప‌ట్టేందుకు ఫిషింగ్ రోడ్ ఉప‌యోగించారు. పొర‌పాటు రోడ్ (చేప‌లు ప‌ట్టే ప‌రిక‌రం) 11,000 వోల్్ట్స క‌రెంటు వైరుకు చిక్కుకుంది. అంతే క్ష‌ణాలో పౌలామి విల‌విల్లాడిపోయింది. దాదాపు 80 శాతం కాలిపోయింది. కొద్దిసేప‌టికి విద్యుత్ షాక్‌కుఅల్లాంత దూరంలో ప‌డిపోయింది. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. బంధువులు వెంట‌నే ఆమెను అపోలో ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఐసియులో ప్రాణాలతో పోరాడుతున్న త‌న గారాల‌ప‌ట్టీని చూసి త‌ల్లిదండ్రులు ఎంత‌గానో ఆవేద‌న చెందారు త‌ల్లిదండ్రులు. అంద‌మైన రోజా పువ్వులాంటి ఆమెను విద్యుత్ తీగ‌లు ఇలా అచేత‌నంగా మార్చేసిన వైనాన్ని త‌ట్టుకోలేక‌పోయారు.

ఆమె బ‌త‌క‌డం వైద్య చ‌రిత్ర‌లో ఓ అద్భుతం అని వైద్యులే ఆశ్చ‌ర్య‌పోయారు. చాలా సంద‌ర్భాల‌లో రోగి స్పాట్‌లోనే చ‌నిపోతారు. క‌రెంట్ కుడి చేతి గుండా వెళ్లి ఎడ‌మ పాదం మొత్తం పాకింది. కుడి చేయి తీవ్రంగా దెబ్బ‌తింది. ఎడ‌మ పాదం మొత్తం ముద్ద‌యిపోయింది. కాలిన గాయా‌ల‌తో ఓ వారం రోజుల‌పాటు న‌గ్నంగానే ఉండాల్సి వ‌చ్చింది. ఆస్ప‌త్రిలో చేరిన ఓ వారంలోనే కుడి చేయి పూర్తిగా తొల‌గించారు.

హైద‌రాబాద్ నుంచి ముంబైకి..
ఓ నెల రోజుల త‌రువాత కాస్త కోలుకున్న త‌రువాత పౌలామిని విమానంలో ముంబైకి తీసుకువెళ్లారు. బ్రీచ్‌కాండీ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించారు.

12 గంట‌ల‌పాటు శ్ర‌మించి…
వైద్యులు చాలా శ్ర‌మించారు. ఎడమ చేయి, కాళ్లు కాపాడాలని వైద్యులు ఎంతో ప్ర‌య‌త్నించారు. అయితే ఎక్కువ శాతం శ‌రీరం కాలిపోయినందున పొత్తిక‌డుపు ద‌గ్గ‌ర మాంసం క‌త్తిరించి దాంతో ఎడ‌మ చేతికి అతికించారు. 12 గంట‌లు పాటు శస్త్ర చికిత్స చేశారు.

త‌ల్లిదండ్రులు మూల‌స్తంభాలుగా
త‌న కుమార్తె ఇలా ఉండ‌డం చూసి త‌ట్టుకోలేక‌పోయారు త‌ల్లిదండ్రులు భ‌ద్రేష్‌, రాజుల్‌ప‌టేల్‌. దివ్యాంగురాలిగా మారిని త‌న కుమార్తెలో మాన‌సిక స్థైర్యాన్ని నింపారు. స్ఫూర్తి క‌థ‌లు, విజ‌య‌వంతమైన జీవితం గ‌డుపుతున్న వాళ్ల క‌థ‌లు చెప్పేవారు. ఇలా ఆమెను మానిసికంగా ధృడంగా ఉండేలా తీర్చిదిద్దారు.

ఉపాధ్యాయుల సాయంతో..
ఆమె పాఠశాలలో ఒక సంవత్సరం కోల్పోయినప్పటికీ, ఆమె ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సహాయకారిగా ఉన్నారు. పౌలామి కొత్త తరగతిలో కూర్చుని మళ్ళీ స్నేహితులను సంపాదించడం కష్టమని వారికి తెలుసు. కాబట్టి ఆమెకు ఇంట్లోనే చ‌దువు చెప్పేవారు. కష్టపడి చదివి, స‌హాయ‌కారి సాయంతో ఫైన‌ల్ పరీక్షలను మంచి మార్కుల‌తో పాస్ అయింది.

ఎంబీఏ పూర్తి చేసి వ్యాపార రంగంలో
పౌలామి ఎంబీఏ పూర్తి చేసి, ఇప్పుడు తన కుటుంబ వ్యాపారాన్ని నడుపుతోంది. ఆమె తన చిన్ననాటి ప్రియుడు సుందీప్ జోత్వానీని వివాహం చేసుకుంది.

ఇది మా ప్రేమ‌క‌థ
సుందీప్ ను పదమూడు సంవత్సరాలుగా తెలుసు. మేము పాఠశాల తర్వాత కలుసుకున్నాం. మంచి స్నేహితులుగా ఉన్నాం. అతను నాకు తెలిసిన మధురమైన వ్యక్తి. ప్రారంభ రోజుల్లో కూడా, నా ప్రమాదం గురించి అతను ఎప్పుడూ నన్ను ఏమీ అడగలేదు. అతనికి తెలిసినవన్నీ నా స్నేహితుల ద్వారా.
“మా సంబంధం గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, మేము మాటలు లేకుండా ఒక‌రి గురించి ఒక‌రం తెలుసుకునేవాళ్లం. నా అవ‌స‌రాల‌ను ముందే గుర్తించేవాడు. అని పౌలామి పటేల్ చెప్పారు. అతని నుండి సహాయం తీసుకోవడం నాకు ఎప్పుడూ ఇబ్బందికరంగా ఉండేదికాదు. ఓసారి రెస్టారెంట్‌కు వెళితే తిన‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డా…అప్ప‌డు ఆయ‌నే స్పూన్‌తో తినిపించాడు. ఇటువంటి మ‌న‌సుకు హ‌త్తుకునే సంఘ‌ట‌న‌లు మా ప్రేమ‌క‌థ‌లో ఉన్నో ఉన్నాయి.

రాస్తూ..డ్రైవ్ చేస్తూ..
ప్ర‌స్తుతం పౌలామి పటేల్ చాలా బ‌ల‌వంతురాలు. చేయి లేకపోయినా దిగులుప‌డ‌లేదు. ఉన్న శరీర అవ‌య‌వాల‌తో ఎలా నెట్టుకురావాలో..ఎలా నెగ్గుకురావాలో ఆమెకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. రోజూ పౌలామి ఏదో ఒక‌టి రాస్తుంది. కారు డ్రైవ్ చేస్తుంది. బంగీ జంప్స్ కూడా చేస్తుంది. ఆమె సాహ‌సోపేత‌మైన జీవితాన్ని త‌న‌కున‌చ్చిన విధంగా సంతోషంగా గ‌డుపుతోంది.

క‌ష్టాలు అధిగ‌మిస్తే అద్భు‌త జీవితం
క‌ష్టాలు..క‌న్నీళ్లు అందిరి జీవితాల్లో ఉంటాయి. ఒక్కొక్క‌రికి ఒక్కో స‌మ‌స్య‌. అయితే స‌మ‌స్య‌ల‌కు కుంగిపోకూడ‌దు. ప్ర‌తి దానికి ప‌రిష్కార మార్గం ఉంటుంది. ముందుగా మ‌న మ‌న‌సు దృఢంగా ఉండాలి. ఏదైనా చేయ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం ఉండాలి. అప్ప‌డే ఎన్ని క‌ష్టాలు, ఒడిదుడుకులు వ‌చ్చినా అవేమీ మ‌న‌ల్ని ట‌చ్ చేయ‌లేవు. నేను మృత్యువుతో పోరాడా. శ‌రీరం 80 శాతం కాలిపోయినా కుంగిపోలేదు. మ‌నోధైర్యంతో ముందుకు సాగా…న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లాడి, జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నా. అవిటిత‌నం అన్న‌ది శ‌రీరానికే అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తెర‌గాలి. అని యువ‌తీయువ‌కుల‌కు సూచించింది పౌలామి.

(Visited 80 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *