ప్రజలందరికీ అందుబాటులో వైద్యం
ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆస్పత్రిలో అందే వైద్యం కంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇంచార్జి , రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లాలో మంత్రి విడదల రజని, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జునతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జీవీఎంసీ 59వ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీ నక్కవాని పాలెం నందు రూ 98.50 లక్షలతో నూతనంగా నిర్మించిన వై.ఎస్.ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, 58వ వార్డు ములగాడ గ్రామం లో రూ.99.80లక్షలతో మరియు 40వ వార్డు ఎకెసి కాలనీ నందు రూ.96.50లక్షల ఎన్ యు హెచ్ యమ్ నిధులు లతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అదే విధంగా 63వ వార్డు క్రాంతి నగర్ లో రూ.99.40 లక్షల ఎన్ యు హెచ్ యమ్ నిధులులతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రానికి మంత్రి విడుదల రజని, జిల్లా కలెక్టర్ డా ఏ. మల్లిఖార్జునతో కలిసి ప్రారంభించారు. అనంతరం 21 వ వార్డు పెద్ద వాల్తేరు దగ్గర ఈ ఎన్ టి ఆసుపత్రి ఆవరణలో రూ.80.00 లక్షల ఎన్ యు హెచ్ యమ్ నిధులులతో నూతనంగా నిర్మించబోవు వైఎస్ ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి మంత్రి శంఖుస్థాపన చేశారు. అదే విధంగా ఆసుపత్రి లో వైద్యం కోసం వచ్చే రోగులతో వైద్య సేవలు, ఆసుపత్రిలో శానిటేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్యం పొందుతున్న పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులతో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
డ్రగ్స్ స్టోర్ ను పరిశీలించిన మంత్రి
మందులు భద్రపరచే ఆధునిక భవనాన్ని వైద్య శాఖామంత్రి పరిశీలించారు. అదే విదంగా మందులు భద్రపరచే విదానం, సకాలంలో ఆసుపత్రులకు మందులను పంపిణీ, రికార్డుల పరంగా మందులు ఉన్నది లేనిది విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు డ్రగ్స్ సరఫరా విషయంలో తగు సూచనలను జారీ చేసారు. ఇంకా అవసరమైన మందుల గురించి ప్రతి పాదనలను పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఎ.పి.ఎస్. ఎం.ఐ.డి.సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నాయుడు డ్రగ్స్ సరఫరా వివరాలను మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలు, పట్టణాలలో ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తోందని , ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఆరోగ్య కేంద్రంలో అందించు వైద్య సేవలను వినియో గించుకోవాలని కోరారు. అన్ని ఆరోగ్య కేంద్రాలలో అవసరాల మేరకు అన్ని రకాల మందులను, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొన్నారు. వైద్యంలో మరింత ఆధునికంగా ఆరోగ్య కేంద్రాలను , సిబ్బందికి తగిన రీతిలో శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచటం జరుగుతుందన్నారు. అదే విదంగా ఆసుపత్రి శానిటేషన్ విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఇ.ఎన్.టి ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందిని ఆదేశిం చారు. ఈ సమావేశంలో వి.ఎం .ఆర్.డి.ఎ. చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల, ఆర్.డి.ఓ హుసేన్ సాహేబ్, జిల్లా వైద్యాధి కారిని కే.విజయలక్ష్మి, కార్పొరేటర్లు, పలువురు వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.