సమాచార హక్కు అప్పీళ్ల పై విచారణ
రాష్ట్ర సమాచార కమీషనర్ ఆర్. శ్రీనివాస రావు జిల్లా పర్యటన
విజయనగరం: రాష్ట్ర సమాచార కమీషనర్ ఆర్. శ్రీనివాస రావు జిల్లాలో వారం రోజుల పర్యటనకు విచ్చేసారు. ఆదివారం జిల్లా పరిషత్ అతిధి గృహానికి చేరుకున్నారు. సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతి రావు, ఆర్.డి.ఓ భవానీ శంకర్ తదితరులు కమీషనర్ కు స్వాగతం పలికారు. ఆర్.టి.ఐ కమీషనర్ ఈ నెల 13 నుండి 19 వరకు జిల్లాలో పర్యటించి, జిల్లా నుండి కమిషన్ కు అందిన అప్పీళ్లను కలెక్టరేట్ లో విచారిస్తారు . జిల్లా లో ఆర్.టి.ఐ క్రింద అందే దరఖాస్తుల గురించి జె.సి, డి.ఆర్.ఓ కమీషనర్ కు వివరించారు. కమీషనర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కూడా ఆర్.టి.ఐ పరిధిలో ఉండాలని, దరఖాస్తులకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు. తన పర్యటనలో ఒక రోజు పి.ఐ.ఓ . ఏ. పి.ఐ.ఓ లతో సమావేశం నిర్వహిస్తానని అన్నారు. సమాచార హక్కు చట్టం క్రింద అందే దరఖాస్తులను అధికారుల వద్దనే పరిష్కారం కావాలని, అప్పుడే కమిషన్ కు వచ్చే సంఖ్య తగ్గుతుందని, అందువలన సత్వర సమాచారం అందితుందని అన్నారు.