కబ్జా కోరల్లో కొప్పాక జిల్లా పరిషత్ హైస్కూల్ స్దలం
అనకాపల్లి :
అనకాపల్లి జిల్లా కొండ కొప్పాక లో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. భూముల
ధరలు పెరగడం ఆపై అనకాపల్లి జిల్లా కావడం తో కబ్జా రాయుల్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ కొండ కొప్పాక జిల్లా పరిషత్ హైస్కూల్ కి పొలం సర్వే నెంబర్ 283 లో అయిదు ఎకరాలు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్తులో ఇక్కడ అ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం వన్ ఈ స్థలం ఉపయోగపడుతుందని అలాగే పాఠశాల విద్యార్థులు ప్లేగ్రౌండ్ ఉపయోగపడుతుందని ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు కాగా ఈ స్థలం ఖాళీగా ఉండటం కొండ వారగా ఉండటం పాఠశాల సిబ్బంది ఇటిక దృష్టి సారించకపోవడం తో ఆక్రమణదారుల దృష్టి ఈ స్థలంపై పడింది. ఇంక అంతే కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పాఠశాల స్థలంలో గత రెండు రోజులు నుండి ఇంటి నిర్మాణానికి పునాదులు తీస్తుండగా స్థానికులు గుర్తించి స్థానిక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణదారులు పాఠశాల స్థలంలో పునాదుల నిర్మాణానికి పూనుకున్నారని స్థానికులు చెబుతున్నారు పాఠశాల స్థలం చెప్తున్నా ఆక్రమణదారులు ఆగటం లేదని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోము నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా కొండ కొప్పాక హై స్కూల్ కు గొలగం సర్వేనెంబర్ 283 లో ఐదు ఎకరాలు కేటాయించడం జరిగిందని ని అయితే పలుమార్లు పాఠశాల స్థలాన్ని సర్వే కోసం స్కూల్ కమిటీ పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అయితే రెవెన్యూ అధికారులు స్పందించలేదని తెలిపారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడటం జిల్లా కలెక్టర్ కార్యాలయం కూత వేటు దూరంలోనే ఈ ఆక్రమణలు చోటుచేసుకోవడం గమనార్హం. తక్షణం జిల్లా పరిషత్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదులను తొలగించి ఆక్రమణ దారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఆక్రమణపై ఇటు విద్యాశాఖ అధికారులు అటు జిల్లా పరిషత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.