ప్రతి పేదవాడికి జగన్న ఇల్లు : ఎంపిపి గొర్లి సూరిబాబు
అనకాపల్లి :
ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి జగనన్న ఇల్లు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం అని అనకాపల్లి ఎంపిపి గొర్లి సూరిబాబు అన్నారు. బుధవారం ఆయన సత్యనారాయణ పురం సచివాలయ పరిధిలోని మూలపేట గ్రామ సచివాలయం లో ఆయన ఇల్లు లేని నిరుపేదలకు జగనన్న గృహ హక్కు పట్టాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం నవరత్నాలు అందించి పేదలకు అండగా నిలిచారని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారన్నారు.దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. రెడ్డి పాలనను చూసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదేశాలతో అనకాపల్లి లో అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన అంగన్వాడీ కేంద్రాలను తణిఖీ చేసారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు గర్బిణీలకు,పిల్లలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. అలాగే రికార్డులు ఆయన పరిశీలించారు. అనంతరం మూల పేట లో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా కొత్త భవనాలకు తీర్మానం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పలకా భాగ్య లక్ష్మి, ఎంపిటీసి అలివేణి,నాగు,నాగమణి, నగేష్, గ్రామ వైసిపి అధ్యక్షులు ఈశ్వరరావు, ఉప సర్పంచ్ భవాణి,కిషోర్, గ్రామ కార్యదర్శి శ్రావణి,వార్డు సభ్యులు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.