ధరలు పెంచుకుంటూ పోతే బతికేదెలా?
అనకాపల్లి : అఖిల భారత వాణిజ్య వర్తక మరియు కార్మిక సంఘాలు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపు మేరకు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు, ఉత్తరాంధ్ర చర్చ వేదిక జిల్లా నాయకుడు పీలా నాని, అబ్దులు కలాం సేవా సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ ప్రవీణ్ కుమార్, ఆటో డ్రైవర్స్ యూనియన్ ఉమ్మడిగా బైక్ లను రామచంద్ర ధియేటర్ ముందు అంబేద్కర్ విగ్రహం నుండి నెహ్రూ చౌక్ కూడలి వరకు నెట్టుకుంటూ వెళ్ళి నిత్యావసర వస్తువుల ధరల పెంపుకు నిరశన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లేకుండగా పెరుగుతున్నాయని తత్ఫలితంగా సామాన్యులు తీవ్రమైన ఇబ్బదులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. కరోనా విజృంభణ మరియు లాక్డౌన్ లతో సామాన్యుడు పూర్తిగా చిదికిపోయి నిలద్రొక్కుకో లేని పరిస్థితులలో ధరల పెంపు తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని. సామాన్యుడు బ్రతుకు బండి ఎంత కష్టంగా లాగుతున్నాడో తెలుపుటకు సూచికంగా ఈ రోజు బైక్ లను నెట్టుకుంటూ వచ్చేటటువంటి ఈ ధరల పెరుగుదలకు నిరశన కార్యక్రమం చేసామని.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో పెట్రోల్, డీజల్ పై పెంచి సుంకాలను, టాక్స్ లను వెంటనే ఉపసంహారించు కోవాలని డిమాండ్ చేసారు.
భాద్యతాయుత ప్రభుత్వాలు కచ్చితంగా ఈ ధరల నియంత్రణ పై పట్టు ఉండాలని. ఆ నియంత్రణకు తిలోదకలు ఇచ్చేసారా అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చెయ్యాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. నిత్యావసర వస్తువుల ధరల అదుపు చెయ్యలేకపోతే రాజీనామా చెయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు కొల్లి సత్యారావు, శివరాము, జోగినాయుడు, వాసు లతో ఆటో యూనియన్ సభ్యలు పాల్గున్నారు.