జీవీఎంసీకి హెచ్‌పీసీఎల్ రూ.కోటి విరాళం

విశాఖపట్నం: నగర పరిధిలో కార్పొరేషన్ చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అనేక కార్యక్రమాలను ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకుగాను, హెచ్.పి.సి.ఎల్. (విశాఖ రిఫైనరీ) వారు కార్పోరేట్ సా మాజిక బాధ్యత కింద ఒక కోటి రూపాయలు మంజూరు చేయుటకుగాను నగర పాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజనతో అవగాహన ఒప్పందం చేసుకొని, ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.

ఒప్పందంలో భాగంగా, బి.పి.ఎల్.తో బ్రతుకుతున్న పేదలకు చెత్తను వేరుచేసి అందించేందుకుగాను 3 రకాల డస్ట్ బిన్లు పంపిణీ, నగర పరిధిలో గల వార్డులలో పారిశుద్ధ్య పనులు నిమిత్తం పుష్ కార్ట్ లు పంపిణీ, ప్లాస్టిక్ కపింగ్ మిషన్లు కొనుగోలు మొదలగు కార్యక్రమాలు జివిఎంసి ద్వారా చేపట్టడానికి హెచ్.పి.సి.ఎల్.తో కుదుర్చుకున్న ఒప్పందంలో గల మొత్తాన్ని వినియోగిస్తారు.

ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ డా.జి . సృజన, అద నపు కమిషనర్ డా, వి సన్యాసిరావు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కి.ఎస్.ఎల్.జి. కాస్తీ పాల్గొనగా, హెచ్.పి.సి.ఎల్.(విశాఖ రిఫైనరీ) యాజమాన్యం తరుపున ఎగ్జిక్యుటివ్ డైరెక్టరు వి. రంనీ రాజు, డి.జి.ఎం. కె. నగిష్ సి.ఎస్.ఆర్ & పి.ఎస్., సీనియర్ మేనేజర్ కాళి తదితరులు పాల్గొన్నారు.

(Visited 10 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *