బైక్ రైడింగ్ జీవితాలే ఇదే మా కథ
టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు
శ్రీకాంత్, సుమంత్ అశ్విన్ హీరోలుగా భూమికా చావ్లా ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఇదే మా కథ చిత్రం టీజర్‌ను హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర ప్రొడక్షన్లో గురుపవన్ దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. బైక్ రైడర్స్ జీవితాలు అనుకోని పరిస్థితుల్లో ఏ విధంగా మార్పులు సంభవించాయో ఈ చిత్రం ప్రధాన కథ అని దర్శకుడు పవన్ చెప్పారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇదే మాకథ’ టీజర్ చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని.. అవ్వాలని కోరుకుంటున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.