త్వరలోనే సినీ కార్మికులకు గుర్తింపు కార్డులు
-భూపతిరాజు శ్రీనివాసురాజు
విశాఖపట్నం : త్వరలోనే సినీ కార్మికులకు ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ తరపున గుర్తింపు కార్డులు అందజేస్తామని ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసురాజు తెలిపారు. గురువారం కణితి రోడ్లులోని ఉన్న తన కార్యాలయంలో సినీ కార్మికుల తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసుత్తం ఫెడరేషన్ కొన్ని యూనియన్ లు ఉన్నాయని, త్వరలోనే మరి కొన్ని యూనియన్ లు ప్రారంభించి సినీ కార్మికులకు ఉపాధి కల్పించడాని సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాల అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పారు. ఫెడరేషన్ లో ఉన్న ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఫెడరేషన్ ను బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె. సన్యాసిరావు, జి. యస్. కళ్యాణ్, ఉపాధ్యక్షులు సాయిరమేష్, జి. వి. ఆర్. మూర్తి, కుమార్ నాయక్, ఆంద్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ. ఎం. ప్రసాద్, అధ్యక్షుడు ఎం. కృష్ణకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు సిహెచ్. రమేష్ యాదవ్, పి. వెంకట్ రెడ్డి, నిర్మల్ భాను, నిర్మాత జై కుమార్ (విజయవాడ), ఫైట్స్ మాస్టర్ సత్యనారాయణ రాజు, సినీ కార్మికులు పాల్గొన్నారు.