నదిలో ఇసుకను తోడేస్తున్నారు అడ్డుకున్న జన సైనికులు స్పందించని అధికారులు

అనకాపల్లి :

 

నేతల అక్రమార్థనకు ఇసుక వరంగా మారింది. తగరంపూడి శారదా నదిలో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇసుకను ఎడ్ల బండి ద్వారా తరలించి జేబులు నింపు

కుంటున్నారు.

నిర్మాణరంగం బాగా పుంచుకోవడం దీనికి తోడు జగనన్న లేఔట్ భారీగా ఉండడంతో ఇసుకకు భారీగా డిమాండ్ నెలకొంది. దీంతో కొందరు నేతల అక్రమార్జనకు ఇసుక కాసులు కురిపిస్తుంది. గత ఏడాది నుండి ఇక్కడ శారదా నదిలో ఇసుకను తోడేస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్న అధికారులు నిద్రపోతున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు ఇక్కడ శారదా నదిలో ఇసుక తవ్వకాలు నిషేధమని నిబంధనలు
పేర్కొంటున్నాయి.

.నదీ గర్భంలో ఇసుకను తీయడం వల్ల భవిష్యత్తులో పకృతి విపత్తులకు దారి తీస్తుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. నదిలో గుల్ల చేయడం వలన రైతులకు తాగునీరు వచ్చే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రామ సర్పంచ్
ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ శారదా నదిలో ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలు వలన ఇక్కడ శారద నదిలో గ్రోయిన్ లు పూర్తిగా ద్వంసం అయ్యాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీతానగరం గ్రోయిన్ పూర్తిగా ద్వంసం అయ్యిందని అన్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఇక్కడ శారదా నదిలో బెల్లం పెన్నాల ద్వారా ఇసుకను తీస్తుండగా వారిని జనసైనికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్కాల మధ్యన వాగ్వాదం చోటుచేసుకుంది.ముమ్మిన వెంకు నాయుడు,కాపుశెట్టి ఆనంద్,నడిగట్ల నాగేశ్వరరావు, అచ్చ ఆనంద్,నందవరపు కోళ్లు పెంటారావు,యాదగిరి బాబ్జీ, నందవరపు శంకర్రావు తదితరులు ఆందోళనలో చేపట్టారు

గ్రామంలో ఇసుక,మద్యం అమ్మకాలకు వేలం పాట

తగరంపూడి శారదానదిలో ఇసుకను తీసి అమ్ముకొనెందుకు,గ్రామంలో మద్యం అమ్ముకొనెందుకు గ్రామ సర్పంచ్ యాదగిరి అప్పారావు గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో వేకం పాట‌ నిర్వహించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉసుక వేలం పాట దక్కించుకున్న వ్యక్తి నుండి గ్రామంలో గ్రామ సర్పంచ్ నుండి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది దీంతో ఇసుక పాట నెగ్గిన వ్యక్తులు అదనంగా డబ్బులు ఇచ్చెందుకు నిరాకరించడంతో ఇసుక పాటను రద్దు చేసి వేరె వ్యక్తులకు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహరం పై రెవెన్యూ,ఎక్సైజ్ అధికారులు ఈ వ్యవహారం పై విచారణ జరిపి అందుకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు.

(Visited 671 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.