నిరుపేదలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికారులు… 30ఏళ్లుగా మా స్వాధీనంలోన్న గ్రామ కంఠ స్థలాలను ఎలా తీసుకుంటారు? ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థలంలోఉన్న లబ్దిదారులు

అనకాపల్లి, వి.డ్రీమ్స్‌:

నిరుపేదలపై అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తగరం పూడికి చెందిన యన్నంశెట్టి

వెంకటరావు, యన్నంశెట్టి పద్మావతి, గంధం అప్పారావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడగల సర్వే నెంబర్‌ 153 లో గల సుమారు 10 సెంట్ల స్థలంలో తామంతా సుమారు ముప్పై ఏళ్లకు పైబడి నుండి ఉంటున్నామన్నారు. తాము ఇళ్లు నిర్మించుకొనేందుకు మా స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠం స్థలాలను ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న గ్రామస్తుల గ్రామకంఠం స్థలాలను అధికారులు దౌర్జన్యంగా లాక్కునేందుకు చూస్తున్నారని గ్రామానికి చెందిన వారు ఆరోపించారు. సోమవారం రాత్రి అందరూ పడుకున్న సమయంలో విఆర్వో, గ్రామ సర్పంచ్‌ కలసి మా గ్రామ స్థలాలను జెసిబి తో పునాదులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమకు ఎటువంటి నోటీసులుగానీ, ఎటువంటి ముందస్తు సమాచారంగానీ ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ దౌర్జన్యాన్ని ఆపాలని వారు అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనకాపల్లి తాసిల్దార్‌ శ్రీనివాస్‌ ను వివరణ కోరగా తగరంపూడిలో డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించిందని ఆ స్థలం గ్రామం గ్రామకంఠం పరిధి లోని ఆ స్థలం ఏర్పాటు లో రెవెన్యూ అధికారులు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే లైబ్రరీ కోసం కేటాయించిన స్థలం ఏ విషయం చేసే దగ్గర మా విఆర్‌ ఓ అక్కడ జరిగిందన్నారు. ఇలా ఉండగా గ్రామ సర్పంచ్‌ అప్పారావు ని వివరణ కోరగా డిజిటల్‌ లైబ్రరీ కోసం నిరుపేదల స్థలాన్ని తీసుకోవడం సరికాదని వేరొకచోట లైబ్రరీకి స్థలం మంజూరు చేయాలని అనకాపల్లి తాహశిల్దార్‌ శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వెళ్లమని సర్పంచ్‌ అప్పారావు తెలిపారు. అయితే గ్రామస్తులకు వేరే చోట స్థలం మంజూరు చేద్దామని వారు ఎవరైనా అడ్డుకుంటే నేను చూసుకుంటానని తనతో తహసీల్దారు చెప్పారని గ్రామ సర్పంచ్‌ అప్పారావు తెలిపారు. అయితే వీరికి నష్టపరిహారంగా గ్రామ నిధుల నుండి అందజేస్తామని సర్పంచ్‌ అప్పారావు స్పష్టం చేసారు. ఇది ఇలా ఉండగా ఈ విషయాన్ని భాదితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లెందుకు సిద్ద పడుతున్నారు.

(Visited 77 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *