తగరం పూడి లో ఇసుక దొంగలు

అనకాపల్లి :

అనకాపల్లి లో ఇసుక దొంగలు రెచ్చి పోతున్నారు. ఇక్కడ శారదా నది లో నిత్యం ఇసుకను

దొలిచేస్తు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అనకాపల్లి మండలం లో శారదా నది తీరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరికి ఇసుక కాసులు కురిపిస్తున్నాయి.ఇక్కడ శారదా నదిలో ప్రతి అయిదు వందల మీటర్లకు ఒక గ్రోయిన్ చొప్పున ఉన్నాయి. ఈ గ్రోయిన్ లద్వారా రైతులకు సాగు నీరు అందే పరిస్థితి. అయితే తగరం పూడి గ్రామంలో నిత్యం ఇక్కడ శారదా నదిలో ఇసుక ను బెల్లం తయారు చేసే పెనంలో కి తీసి ఒడ్డుకు చేరుస్తున్నారు.ఇక్కడ సీతానగరం గ్రోయిన్ సమీపంలో ఇసుకను తియ్యడం వల్ల గ్రోయిన్ లు దెబ్బతింటున్నాయి.దీని వల్ల రైతులకు సాగు నీరు అందడం లేదు. ఎటువంటి అనుమతులు లేకున్నా స్దానిక అధికార పార్టీ నేతలు కను సైగ ల్లో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగిపోతుంది. ప్రభుత్వం ఇసుక‌ డిపో లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ శారదా నదిలో ఎటువంటి అనుమతులు లేకున్నా అధికార పార్టీ నేతలు అక్రమ ఇసుక వ్యాపారానికి తెరతీసారు.బెల్లం తయారీకి ఉయోగించే పెనాలు ద్వారా ఇక్కడ శారదా నదిలో ఇసుకను ఒడ్డుకు చేర్చి అక్కడ నుండి ఎడ్ల బండి ద్వారా చుట్టుప్రక్కల గ్రామాలకు తీసుకు వెళ్లి అమ్ముతున్నారు. తెల్లవారుజామున అయిదు గంటలకు ప్రారంబించి ఉదయం పది గంటలు వరకు ఇసుకను పెనాలు ద్వారా ఒడ్డుకు చేరుస్తారు. శారదా నదిలో ఒక్కో పెనానికి అయిదు వందల రూపాయలు చొప్పున గ్రామంలో పెద్దలకు ఇవ్వడానికి ఒప్పందం అని తెలిసింది. నెలకు సుమారుగా రెండు లక్షలు వరకు గ్రామ పెద్దలకు చెల్లిస్తున్నట్లు సమాచారం. స్దానికంగా విలేజ్ రెవెన్యూ అధికారి అలాగే నిత్యం గ్రామంలో కలియ తిరిగే గ్రామ తలయారి కళ్ల ముందే ఇసుక అక్రమంగా తరలి పోతుందని స్థానికులు అంటున్నారు. గతంలో ఇక్కడ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసిన రెవెన్యూ ఆరై పై ఇసుక దొంగలు దాడికి పాల్పడ్డా సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు ఇసుక దొంగలకు బయపడి ఇటువైపు కన్నెత్తి చూడటం మానేశారు. దీంతో ఇసుక దొంగలు రెచ్చి పోతున్నారు.గత ఏడు‌ నెలలు నుండి యదేచ్చగా ఇసుకను తీసేస్తిన్నారు.శారదా నది లో తీసిన ఇసుకను అనకాపల్లి మండలంలోని సీతానగరం, కూండ్రం,వేటజంగాలపాలెం,రొంగలవానిపాలెం,గ్రామాలతో పాటు ప్రక్క మండలాలకు ఇసుకను తరలిస్తున్నారు.ఇక్కడ శారదా నదిలో ఇసుక తరలి పోకుండా నది ఒడ్డున సిసి కెమెరాలను అలాగే శారదా నది గ్రామాలలో కూడా సిసి కెమెరాలు ఎర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అక్రమ ఇసుక తరలింపు ను కట్టడి చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.

(Visited 126 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *