అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు
వైైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని, మరో 20 ఏళ్లు సిఎం జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వైైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సిఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికీ నాలుగేళ్లు అయిన సందర్బంగా లక్ష్మీనారాయణ నగర్లో గల డివిఆర్ కార్యాలయంలో శనివారం స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోనే సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్లో సిఎం జగన్మోహన్రెడ్డి చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. కోవిడ్ ప్రబలడంతో ఏడాదిన్నరగా దేశం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటీకి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలపుకుని, సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా వెనుకంజ వేయలేదన్నారు. 2022 మార్చి బడ్జెట్ తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిఎం జగన్మోహన్రెడ్డి పథకాలు రచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత గత ఐదేళ్లలో అభివృద్ధి చేయక పోయినప్పటికీ పబ్లిసిటీలో ముందు వరుసలో ఉండేవారని, సింఎ జగన్ పబ్లిసిటి కోసం ప్రాకులాడరని, అభివృద్దే ధ్యేయంగా పని చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైని సిఎంగా పేరు గడిరచారని పేర్కొన్నారు. గత ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు సిఎం జగన్ నాయకత్వాన్ని బలపరచి కనీవినీ ఎరుగని మెజార్జీని అందించారని, అదే మెజార్టిని స్థానిక ఎన్నికల్లో కూడా ఇచ్చారన్నారు. ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కళ్లబొల్లి మాటలతో విమర్శలు చేస్తున్నారని, ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు.
పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దు
పట్టణంలో వైసీపీ పార్టీకి చెడ్డ పేరు తీసుకు వచ్చే విధంగా కొంత మంది ప్రవర్తన తనకు బాధగా ఉందని, ఇటువంటి పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలు అందరికీ సమాచారాన్ని ఇచ్చి చేయాల్సి అవసరం ఉందని దాడి వీరభధ్రరావు అన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే చేయాల్సి ఉన్నప్పటికీ తాను తన కార్యాలయంలో ఎందుకు చేయాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు. పట్టణ పార్టీ కార్యక్రమాల్లో కొంతమందికే సమాచారాన్ని ఇచ్చి మరి కొందరికీ ఇవ్వడ పోవడం తనకు బాధాకరంగా ఉందని, మనమంతా కలిసి జగన్‌మెహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేయాల్సి ఉందని తెలిపారు. తాను వైసీపీలో ఒక కార్యకర్తనే అని, తనకు కూడా సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము అంతా సిఎం జగన్ నాయకత్వంలో పని చేస్తాం తప్పా వేరొకరి నాయకత్వంలో పని చేసేది లేదని తేల్చి చెప్పారు. 2013లో ఎంతో మంది ఈ రాష్ట్రంలో పెద్ద నాయకులు ఉన్నప్పటికీ వైసీపీలో చేరక పోయినా తాను వైసీపీలో చేరి పశ్చిమ నియోజకవర్గం నుంచి తన కుమారుడిని సిఎం జగన్ ఆదేశాలతో పోటీకి దింపానన్నారు. 2014లో ఓటమి చెందినప్పటీకి స్థానిక పార్టీ రాజకీయాలతో తాము పార్టీకి దూరంగా ఉన్నామని, ఏ పార్టీలో చేరలేదన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిరది తానేనని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, 81వ వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మిసౌజన్యరాంబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ శిలపరశెట్టి బాబి, 80వ వార్డు ఇన్చార్జి కొణతాల భాస్కరరావు, గౌరీ పిఎసిఎస్ అధ్యక్షులు కాండ్రేగుల కృష్ణఅప్పారావు, మళ్ల బుజ్జి, కర్రి మోదినాయుడు, వైసీపీ నాయకులు కొణతాల సత్యనారాయణ, బొడ్డేడ శంకరరావు, మళ్ల రాజా, విల్లూరి రాము, న్యాయవాది డివి నరసింహారావు, కాండ్రేగుల విశ్వేశ్వరరావు, రేబాక రామారావు, కోరుబిల్లి పరి, పీలా శ్యామ్, దాడి ఈశ్వరరావు, సూరిశెట్టి వికాస్, జెర్రిపోతుల ధర్మారావు, బొడ్డపాటి చినరాజారావు, పలకా కాసులు, సాలాపు సూరిఅప్పారావు, వియ్యపు శ్రీనివాసయాదవ్, గొంతిన లోవఅప్పారావు, సర్పంచ్ మువ్వల రాము, ఎంఎన్ఎస్ అప్పారావు, భీశెట్టి కృష్ణఅప్పారావు, కర్రి రుద్రి పాల్గొన్నారు.