సౌకర్యాలు మెరుగుపర్చండి
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం జిల్లా ఆస్పత్రి పేరుకి మాత్రమే అందులో ప్రజలకు కావలసిన వైద్య పరికరాలు గాని ప్రజలకు వైద్యం చేయడానికి తగిన వైద్య సిబ్బంది లేరని ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యుడు బుద్ద రాజేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేరుకే 250 పడకల ఆసుపత్రి అని రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. హాస్పిటల్ లో సిటీ స్కాన్ ఎమ్ఆర్ఐ స్కాన్ వున్నా పనిచేయడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారన్నారు. మరి ప్రజా ప్రతినిధులు అయిన పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ గానీ అలాగే ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గాని దీని మీద దృష్టి పెట్టలేదన్నారు. ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళు ప్రజల దగ్గర వేలవేలు డబ్బులు అన్యాయంగా వసూలు చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొన్ని దాతలు ఇస్తున్న విరాళాలు ఎన్టీఆర్ వైద్యాలయం లో పని చేయని సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ బాగుచేసి చేసి ఉండవలెను అలాగే ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉంచవలెను మరి గత వారం రోజులుగా దాతల ఇస్తున్న విరాళాలు ఫోటోలు వేసుకున్నంత శ్రద్ధ ఆసుపత్రి లో రోగులకు కావలసిన వైద్య పరికరాలు అలాగే వైద్య సిబ్బంది మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకర విషయం అని బుద్ధ రాజేష్ అన్నారు.