జ‌గ‌న్ పాద‌యాత్ర ఓ సంచ‌ల‌నం

విశాఖపట్నం : సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జీవీఎంసీ 35వవార్డు దుర్గాలమ్మ ఆలయంలో వార్డు కార్పొరేటర్ విళ్లూరి భాస్కరరావు సీఎం జగన్మోహన్ పేరిట అమ్మవారి కి పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా విళ్లూరి భాస్కరరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెద్దు అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వెనుకాడలేదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండరాజీవ్ గాంధీ, వైసీపీ నాయకులు శ్రీవత్సవ్, కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

(Visited 36 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *