పోలవరం పై జగన్ కుట్ర
ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు
అనకాపల్లి : పోలవరంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నాగ జగదీశ్వర్ రావు విమర్శించారు పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్లు కాగా150 మీటర్లు కనీస నీటిమట్టం 41. 15 మీటర్లు 135 అడుగులు 150 అడుగుల నుంచి 135 అడుగుల కుదించే కుట్ర చేస్తున్నారన్నరన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని చూస్తున్నారని, కుడి కాలువ నీటి నీ తీసుకునే నీటిమట్టం 35.5 మీటర్లు ఎడమ కాలువకు 33 మీటర్లు పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించమని జగన్ రెడ్డి నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పారని నాగ జగదీష్ తెలిపారు. కానీ ఆడవారు మాటలకు జగన్ రెడ్డి చేష్టలకు అర్ధాలు వేరే జగన్ జీవిత చరిత్ర అంతా అబద్ధాలు పుట్ట పైకి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నారు. పోలవరం ఆమోదించిన డిజైన్ ప్రకారం పూర్తి చేయాలనే కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుండగా జగన్ రెడ్డికి చెవికి ఎక్కడం లేదని అన్నారు. పోలవరాన్ని నాశనం చేయడానికి కుట్ర తో దుష్ట శక్తులతో అపవిత్ర కలయికలతో తెలంగాణ తో చేతులు కలిపి కుట్ర చేస్తున్నారని పోలవరం లో ఒక ఇటుక తగిన ఒక అడుగు ఎత్తు తగ్గినా ఆది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పరిణామాలకు కారణం అవుతుందని అలాగే జల మంత్రిత్వ శాఖ సలహాదారు వేదిరే శ్రీరామ్ జల శక్తి చైర్మన్ హోల్డర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన అధికారి చంద్రశేఖర్ అయ్యర్ ఫిబ్రవరి 16న ఢిల్లీలో జరిగిన సమావేశం మినిట్స్ బయటపెట్టాలని నాగ జగదీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గం మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు పాల్గొన్నారు.