ప్రజా సమస్యల పట్ల జేసీ నిర్లక్ష్యం తగదు

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. రింగ్ రోడ్డు లో ఉన్న తన క్యాంపు కార్యాలయం నుంచి విలేకరుల సమావేశంలో దాడి వీరభద్ర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పట్టణంలో 999 ప్రైవేటు ఇళ్ళను 22 ఏ ప్రభుత్వ పోరంబోకు స్థలాలుగా మార్చారన్నారు. గత 20 నెలలుగా ఈ ప్రధాన సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. 1922 సంవత్సరం టౌన్ సర్వే రిజిస్టర్ ప్రకారం సొంత స్థలాలుగా రికార్డు అయ్యాయని, ఆర్ డి ఓ వంటి రెవెన్యూ అధికారులు విచారణ జరిపి సొంత స్థలాలుగా గుర్తించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లామన్నారు. జాయింట్ కలెక్టర్ నిర్లక్ష్యపు ధోరణి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా హక్కుదారులు తమ ఆస్తులను బ్యాంకుల్లో కుదువ పెట్టడం, అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనికి కారణమైన జాయింట్ కలెక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

(Visited 280 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *