ఉక్కునగరంలో మళ్లీ కోవిడ్‌

ఉక్కునగరం : విశాఖ ఉక్కులో కోవిడ్ కేసులు మరలా పెరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు సడలించడం , పండుగ వాతావరణం కలసి ఈ వారంలో సుమారుగా 16కేసులు వరకూ వచ్చాయి. కోవిడ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి మరలా మొదలయ్యాయని తెలుస్తుంది. విశాఖ ఉక్కు ఆస్పత్రిలో వార్డుల్లో 8 కేసులు వున్నాయని మిగతావారు హోమ్ ఐసోలేషన్ లో వుంచామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కు కచ్చితంగా ధరించి 2గజాల సామాజిక దూరం పాటించాలని, వీలైనంతవరకూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఉక్కునగరంలో వివాహాది శుభకార్యాలకు బయట ప్రాంతాల నుంచి ప్రజలు రావడం వలన కరోనా ప్రమాదం వుంటుందని, అందుచేత పంక్షన్లలో 200లకు మించకుండా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ అడ్మిన్ వారిని కోరామని తెలిపారు.

(Visited 4 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *