మొదటి షో పడలే : రవితేజకు షాక్
క్రాక్ సినిమా మొదటి షో ఈ రోజు పడలేదు. థియేటర్ కు వచ్చిన వారంతా వెనుదిరిగిపోతున్నారు. కొన్ని కారణాల రిత్యా ఫైనా న్షియల్ ఇష్యూస్ సెటిల్ కాకపోవడంతో ఈ సినిమా మార్నింగ్ షో ప్రదర్శనకు నోచుకోలేదు. మ్యాట్నీ ఆట సమయానికి సినిమా ప్రదర్శనకు నోచుకునే అవకాశం ఉందని హైద్రాబాద్ కు చెందిన కొందరు మీడియా ప్రతినిధులు చెబుతున్న మాట. రవితేజ హీరోగా శ్రుతి హసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతున్న త రుణంలో ఆరంభంలోనే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ తరువాత దాదాపు అన్ని థియేటర్లూ ఓపెన్ అవు తున్న సమయంలో క్రాక్ అందుకు మరింత ఊపు తీసుకువచ్చే అవకాశం ఉందని భావించారు. సినిమాపై మంచి హోప్స్ కూడా ఇందుకు తోడయ్యాయి. ప్రముఖ నిర్మాత మధు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమన్ పాటలు కూడా మంచి జోరే కొనసాగించాయి. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఈ సినిమా మొదటి ఆట పడలేదు. దీంతో ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
– VDREAMS గ్రౌండ్ రిపోర్ట్