సుదీర్ఘ కాలంగా పేరుకు పోయిన చెత్తను తొలగించి ఆక్రమణకు గురికాకుండా కంచె ఏర్పాటు
అనకాపల్లి :
మండలం లోని తుమ్మపాల గ్రామ పంచాయతి పరిధిలో గల కొత్తపేట వీధి మెయిన్ రోడ్డు లో సులభ్ కాంప్లెక్స్ వద్ద పందులు స్వైర విహారం చెయ్యడం వలన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠన్ శెట్టి, జిల్లా పంచాయతి అధికారిణి శిరిషా రాణి ఆదేశాలు మేరకు సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, పంచాయతి ఇఒ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సులభ్ కాంప్లెక్స్ చుట్టూ గత నాలుగు రోజులుగా పేరుకు పోయిన చెత్తను తొలగించె పనులను చేపట్టారు. సుమారు 50 సెంట్ల స్థలాన్ని కబ్జా కు గురికాకుండా చుట్టూ సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేసారు. అంతే కాకుండా పందులు ప్రవేశించకుండా పోల్స్ కి సోమవారం మెస్ ఏర్పాటు చేసారు. సుమారు నలబై ఏళ్ల నుండి సంత బయలు వద్ద పేరుకుపోయిన చెత్తను సుమారు ఎనిమిది ట్రాక్టర్ లు ద్వారా రెండు జెసిబి లతో గత నాలుగు రోజులు నుండి తరలింపు పనులు చేపట్టారు. సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన చెత్తను తొలగించి ఈ ప్రాంతాలను అద్దంలా చేసిన సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, ఇఒ శ్రీనివాసరావు లను స్థానికులు హర్షం వ్యక్తం చేసారు