నీలిమాను గెలిపిద్దాం

దాడి జయవీర్ సారథ్యంలో ప్రచారం


అన‌కాప‌ల్లి: జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం 80వ వార్డ్ వైస్సార్సీపీ ప్రచారం జోరుగా సాగింది. ముందుగా వైఎస్సార్‌సీపీ నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో గంగిరావిచెట్టు వద్ద ఉన్న గంగపరదేశమ్మ గుడిలో జయవీర్, నీలిమ భాస్కర్ లతో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. భారీ జనసందోహంతో గడప గడపకు సాగిన ప్రచారంలో జైజగన్, జై డి.వి. ఆర్ అనే నినాదాలతో హోరేత్తింది .ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు అని స్వచ్ఛందంగా నినదించారు. గత ఎన్నికలలో గెలుపుకంటే భారీ మెజారిటీతో నీలిమ భాస్కర్ ని గెలిపించుకుంటాం అని జయవీర్ కి ప్రజలు మాటిచ్చారు. జయవీర్ మాట్లాడుతూ ప్రజలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గుండెల్లో నిలిచిపోయాయన్నారు.

నీలిమ భాస్కర్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అలాగే ప్రజలకు ఏ సమయంలోనైనా తోడుండే మంచి మనిషి మన నీలిమ భాస్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, మళ్ల రాజా, బొడ్డేడ శంకరరావు,కాండ్రేగుల కృష్ణ అప్పారావు,కె.ఎమ్. నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కాండ్రేగుల సుబ్రహ్మణ్యం,పొలిమేర సత్తిబాబు,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,కర్రి కుసుమ,మళ్ల శ్రీను,కాండ్రేగుల వెంకట్, వాసుపల్లి తాతీలు, చదరం పరమేశ్వరరావు,విల్లూరి రామక్రిష్ణ,విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,కాండ్రేగుల వెంకటి, సూరిశెట్టి రాజు, మర్రా జాన్ బాబు,పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 90 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *