రైల్వే స్టేషన్ విస్తరణకు లైన్ క్లియర్
22-ఏ నుండి 999 గృహాలకు విముక్తి కలిగించిన కలెక్టర్
సీఎం జగన్‌కు దాడివీరభద్రరావు కృతజ్ఞతలు
కలెక్టర్ వినయ్‌చంద్‌ను ఫోన్లో అభినందించిన దాడి
అనకాపల్లి : అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 999 సొంత గృహాలను 22-/ఏ ప్రభుత్వ జాబితా
నుంచి తొలగిస్తూ కలెక్టర్ వినయచంద్ ఉత్తర్వులు జారీ చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి దాడి వీరభద్ర రావు తెలిపారు. వందలాది సంవత్సరాల నుంచి యజమానులైన ప్రజల సొంత గృహాలను చంద్రబాబు హయాంలో 2016 లో ప్రభుత్వ భూములుగా నిర్ణయించి వెబ్ లాండ్ రికార్డుల్లో నమోదు చేసి, ప్రజల ఆస్తులకు హాని కలిగించి, వెయ్యి కుటుంబాలను చిత్ర హింసకు గురి చేశారు. ఈఅక్రమాన్ని సవరిస్తూ, ఈ గృహాలు ప్రభుత్వ స్థలాలు కావని, సొంత గృహాలని ఉత్తర్వులు జారీ చేసిప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కలెక్టర్ కు ప్రజల తరఫునదాడి కృతజ్ఞతలు తెలిపారు. దీని వలన రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ కు అవరోధం తొలగిందని,స్థలాలు కోల్పోయే వారికి జి.వి.ఎం.సి. , టి.డి.ఆర్. సర్టిఫికెట్లు ఇచ్చి, విస్తరణ కార్యక్రమాన్ని చేపడతారని దాడి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు తాను యిచ్చిన హామీని నిలబెట్టుకోడానికిసహకరించిన అధికారులను కూడా అభినందించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, పట్టణ మెయిన్ రోడ్డు, కోట్నివీధి, మల్ల వీధి, పెద్ద వీధి, శ్రీధరాల వీధి, బొగ్గారపు వీధి, అంబేద్కర్ కొలని, రెల్లి వీధి, రింగు రోడ్డు, కొణతాల కోలనీ, సరిసా వారి కొలని, కుంచావారి వీధి, చినరాజుపేట, పెదరాజుపేట, గొల్ల వీధి, పిల్లావారి వీధి, చేపల బజారు ఏరియా,సబ్బవరం రోడ్డు ప్రాంతాల ప్రజలకు తమ ప్రభుత్వం న్యాయం చేసినందుకు సంతృప్తి కరంగా వుందని వీరభద్ర రావు తెలిపారు. 20 నెలలు పెండింగులో వున్న ఈ పని చేయించడం కోసం జాయింట్ కలెక్టర్ ని ఇబ్బంది పెట్టినందుకు విచారం వ్యక్తం చేశారు. ఫైలు అందిన 24 గంటల్లోపుగా ఉత్తర్వులు జారీ చేసినందుకు కలెక్టర్ ని దాడి ఫోన్‌లో అభినందించారు.