శ్రీక్షేత్రమ్‌లో శ్రీనివాస కళ్యాణం
పంచమ వార్షిక బ్రహ్మూెత్సవాల సందర్భంగా ప్రముఖ భారతీయ తత్త్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రమ్‌లో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో త్రిదండి దేవనాథ రామానుజజీయరుస్వామి పర్యవేక్షణలో శ్రీదేవి భూదేవి సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామికి వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన యజ్ఞాచార్య శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయం అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు, శ్రీనివాస రమేష్ ఆచార్యులు శ్రీనివాసునికి కళ్యాణం గావించారు. ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్త దుర్గాబాలాజీ, ఉమాదేవి దంపతులు, నీరజమన్నే, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
(Visited 44 times, 1 visits today)