మెడికల్ సిజిఎమ్ డాక్టర్ ప్రకాశ్ కు సన్మానం

విశాఖ‌ప‌ట్నం: ఇంటక్ మరియు ఇంటక్ మెడికల్ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కన్వీనర్ గోపాలకృష్ణ అధ్యక్షతన విశాఖ స్టీల్ జనరల్ హాస్పటల్ సిజిఎమ్ డాక్టర్ కె.హెచ్.ప్రకాశ్ గారిని ఘనం గా సత్కరించారు.
ఇంటక్ అధ్యక్షులు గంధం వెంకట్రావు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో బాధ్యతలు స్వీకరించిన మీరు కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూసారని, మీ పని తీరుపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.కార్మికులకు మెరుగైన వైద్యం అందించడానికి, హాస్పటల్ డెవలప్మెంట్ కు ఇంటక్ ఎప్పుడూ ముందుండి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో మీ అభిమానాన్ని పొందగలిగానని, కర్మాగారం కోసం నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా బాగుంటేనే కర్మాగారం బాగుంటుందని, ఆవిదంగా పనిచేస్తూ ముందుకు వెళతాం అని అన్నారు.నేను వచ్చాక చేసిన అధ్యయనంలో చాలా మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు క్యాన్సర్ వ్యాదికి గురౌతున్నారని, వాటి మూలాలను కనుక్కొని జాగ్రత్తలు తీసుకునే విదంగా అందరం పనిచేయాలని తెలుపుతూ, అందరికీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.కేక్ కట్ చేసిన అనంతరం డాక్టర్ ప్రకాశ్ ను ఘనంగా సత్కరించారు.అలాగే జి.ఎమ్ మధుసూదనరావు గారిని, మరో జి.ఎమ్ మెడికల్ డాక్టర్ శ్యామలాదేవి గారిని కూడా కలసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈకార్యక్రమంలో ఇంటక్ నాయకులునీరుకొండ రామచంద్రరావు, నాయక్,మరిసా రామచంద్రరావు,విల్లూరి మహాలక్ష్మి నాయుడు, జెర్రిపోతుల మోహన్ కుమార్, నాగేశ్వరరావు, తాతబాబు, ఇంతియాజ్, జగదాంబ, సుగుణ, ఉషారాణి,శ్రీనివాసరావు, నాగబాబు,దినేష్,సత్యనారాయణ,మూర్తి,అమ్మోరు,జగదీష్,ఆకుల నూకరాజు, ఆర్ ఎమ్ హెచ్ పి రాజు తదితరులు పాల్గొన్నారు.

(Visited 29 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.