మిస్ దిశ షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌

మీడియా క‌నెక్ట్స్ బ్యాన‌ర్పై భానుప్ర‌కాష్ బడే స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ల‌ఘు చిత్రం మిస్ దిశ. నేటి స‌మాజంలో మ‌హిళ‌లు, అమ్మాయిల‌పై ప్రేమ పేరుతో జ‌రిగే మోసాల‌ను వివ‌రించేందుకు ఈ ల‌ఘు చిత్రం నిర్మించిన‌ట్టు నిర్మాత ఎస్ ఆర్ తెర‌ప‌ల్లి అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో విశాఖ‌, గాజువాక, తూర్పుగోదావ‌రి జిల్లాల‌కు చెందిన న‌టీన‌టులు న‌టించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన దిశ యాప్‌ను ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు భానుప్ర‌కాష్ తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఎఫ్ ఎం బాబాయ్‌, ముల‌క‌ల్లి బాబూరావు, మ‌ణి, ఐశ్వ‌ర్య‌, హైమావ‌తి, ఉద‌య్‌కుమార్‌, సంతోష్‌, గిరి, అజేయ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు డీవోపీ ర‌మ‌ణ‌, మ్యూజిక్ ఎం ఎస్ కే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

(Visited 103 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *