హెడ్ లైన్ టుడే : మరింత సమాచారం దివీస్ ఫ్యాక్టరీ నుంచి …
హెడ్ లైన్ టుడే : మరింత సమాచారం దివీస్ ఫ్యాక్టరీ నుంచి …
బహిరంగ సభలో
ఏం చెప్తారు?
ఉభయ గోదావరి జిల్లాలూ వరుస ఘటనలతో కలత చెందుతున్నాయి అట్టుడుకుతున్నాయి. జనసేన ఇప్పుడు ఓ కొత్త నిరసన కు సై అంటోంది. బీజేపీ కూడా అందుకు వంత పాడుతోంది. కాలుష్య కారకాల నియంత్రణకు ఏ ప్రభుత్వం చర్యలూ తీసుకోకపోగా కేవలం ఇదంతా పొలిటికల్ డ్రామాలో భాగంగా మాట్లాడుతూ గొడవలాడుతూ తగవుకు పరిష్కారం వెతక్క రాజకీయం పలు రం గులు పూసుకుంటుందన్నది అంగీకరించదగ్గ వాస్తవం. తాజాగా పవన్ ఈ అంశాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. గతంలో తుందు ర్రు పోరాటంకు మద్దతిచ్చారు కానీ తరువాత ఆ ఘటనకు సంబంధించి ఆ పోరును కొనసాగించలేకపోయారు అన్నది ప్రధాన వి మర్శ. అప్పుడు టీడీపీ ఈ ఫ్యాక్టరీకి కొమ్ముకాసిందన్నది ఓ నిజం. కానీ ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడూ కూడా త మ గొంతుక కాలుష్య కారక ఫ్యాక్టరీపై వినిపింపజేయడం ఓ విధంగా ఆశ్చర్యమే!
భూ కేటాయింపు
వైసీసీ చేసింది అదే వివాదం
దివీస్ ఫ్యాక్టరీ తుందుర్రు ఫ్యాక్టరీ ఒక్కటే రెండూ వేర్వేరు అనుకోలేం.. వ్యర్థాలను వదిలే క్రమంలో కనీస ప్రమాణాలు పాటించక ఇవి తమకు నచ్చిన రీతిన ఉంటున్నాయన్నది పరిశీలన నిర్థారణ కూడా.. తూర్పుగోదావరి దివీస్ ఏనాటి నుంచో వివాదాలకు కేంద్రంగా ఉంది. కమ్యూనిస్టులు తమ ప్రాబల్యం పెంపులో భాగంగా ఈ ఫ్యాక్టరీ విషయమై పోరాడారు. పోరాడుతున్నారు కూడా..
ఇప్పుడు ప్రధాన విపక్ష అధికార పక్షాలు తమ పట్టు లో భాగంగానే ఈ కంపెనీకి సంబంధించి రాజకీయాలు నెరపుతున్నాయని మీడియా కథనాలు విశ్లేషిస్తూ అందిస్తున్న వివరం. వైసీపీ సర్కారు ఈ ఫ్యాక్టరీ కి తాజాగా కేటాయించిన భూమే అసలు వివాదాని కి కారణమని ఓ మీడియా విశ్లేషణ.
ఛలో తుని
అడ్డుకోలేరు మేం ఉరికి వస్తాం ఆ ఊరికి
ఫ్యాక్టరీ గొట్టాలు మీడియా గొట్టాలు విరుద్ధంగా ఉంటాయి అని అనుకోలేం. రెండూ కావాల్సినంత కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉం టాయి.. ఫ్యాక్టరీ గోడలు కూల్చే ప్రయత్నం ఒకటి ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందన్నది నిన్నటి వార్తల సారాంశం. క మ్యూనిస్టుల పోరు వేరు జనసేన పోరు వేరు అని అనుకోవాలిక. ఎందుకంటే జనసేన బీజేపీకి మద్దతు దారు. ఈ నేపథ్యంలో ది వీస్ ఫార్మా భవిష్యత్తు ఎలా ఉంటుంది. మంత్రి మేకపాటి గౌతమ్ చెప్పే మాటను పాటిస్తుంది అని అనుకోవడం ఓ భ్రమ. కేసుల వి షయమై ఆయన ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చారు. స్థానికులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణకు కంపెనీ ముందుకు రావాల ని కోరారు..అలానే ఇంకొన్ని జాగ్రత్తలూ తీసుకుని ఫార్మా కంపెనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇవి ఇలా చర్చల దశలో ఉండంగానే జనసేన దివీస్ పై గొంతెత్తింది. స్థానిక ఎన్నికల కోడ్ కూ రేపటి నిరసనకూ సంబంధం లేదని తేల్చే సింది. ఆఖ రి నిమిషంలో పోలీసు అనుమతితో పవన్ నిరసన ఎటువంటి కీలక వ్యాఖ్యలకు కేంద్ర బిందువు కానుందో మరికొద్ది గంటల్లోనే తే లిపోనుంది. ఏడాది ఆరంభంలో కొన్ని ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న నిరసన ఇది. ఇప్పటికే జన సేన శ్రేణులు తుని పరిస ర ప్రాంతాలకు చేరుకున్నాయి. పవన్ నిరసనను అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సన్న ద్ధం అవుతున్నాయి.
పవన్ టార్గెట్
ఎవరిపై ఎందాక?
పోరు తీవ్రం అయ్యేనా!
పోలిటికల్ మైలేజ్ వస్తుందా!
పరిశ్రమలు అన్నీ మంచే చేశాయి..చేస్తాయి..చేయాలని అనుకుంటాయి ఈ క్రమంలో దివీస్ ఏమయినా మినహాయింపా.. అక్కడ ఏర్పాటుకు సిద్ధం అవుతున్న అనగా తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ ఫ్యాక్టరీ ఇందుకు మినహాయింపా.. ఫ్యాక్టరీ వద్దంటూ ఇప్ప టికే రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గోదావరి బిడ్డలు కొత్త పాకల (తుని నియోజకవర్గం) వాసులు ఈ సారి మ రింత ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జనసేనాని పవన్ రాక నేపథ్యంలో రేపటి వేళ ఆయనేం చెబుతారో అన్నది ఆస క్తి. ప్రతిపక్ష నేత హోదాలో ఆ రోజు తాము ఈ దివీస్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని పరిశ్రమలకు సంబంధించి స్పష్టమయిన వి ధానం తమకు ఉందని జగన్ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక అప్పటి స్థాయిలో స్వరం వినిపించడం లేదు అన్నది ఓ విమ ర్శ. ఈ నేపథ్యంలో పరిశ్రమల కాలుష్యం, ఏర్పాటు తరువాత వచ్చే ప్రభావాలూ వీటన్నింటిపై రాష్ట్ర ప్రభు త్వం ఏం చెప్పాలను కుం టుంది అన్నది ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు..కానీ ప్రకటనలు మాత్రం పుంఖాను పుంఖాలుగా అందిస్తోం ది ..అని విపక్షం ఆరోపిస్తుం ది. పవన్ గతంలో తుందుర్రు ఫ్యాక్టరీ విషయమై మాట్లాడారు. అది పశ్చిమగోదావరి పరిధి. ఇప్పుడు దివీస్ వంతు..రేపటి నిర సన కు సంబంధించి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలూ పవన్ చెప్పబోయే మాటలపై దృష్టి సారించాయి.