ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : తహశీల్దారు శ్రీనివాసరావు
అనకాపల్లి :
కొండ కొప్పాక జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం కబ్జాపై అనకాపల్లి తాసిల్దార్ శ్రీనివాస రావు స్పందించారు. కబ్జాకు గురైన హై స్కూల్ స్థలాన్ని ఆక్రమణలు తొలగించాలని గొలుగాం విఆర్వో రమేష్ కు ఆదేశాలు జారీ చేసామన్నారు . ఈ మేరకు విఆర్ఒ ఆక్రమణ లను తొలగించారని అన్నారు. ఆక్రమణ దారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకటామని తహసీల్దారు హెచ్చరించారు. స్కూల్ స్థలం కబ్జా కు గురికాకుండా విద్యా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.హైస్కూల్ స్థలం సంబంధించి రికార్డులను సమర్పిస్తే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తామని అయన తెలిపారు.
(Visited 171 times, 1 visits today)