సంగీతం సార్వజనీనమైనది

 – జిల్లా పౌరసంబంధాల అధికారి డి.రమేష్‌


సంగీతం సార్వజనీనమైనదని జిల్లా పౌరసంబంధాల అధికారి డి.రమేష్‌ అన్నారు. ప్రశాంతి సంగీత వాద్యశిక్షణా కళాశాల, విజయనగరం ఆధ్వర్యంలో సంస్థ ద్వితీయవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం గురజాడ కళాభారతిలో బ్రతుకంతా ప్రతినిముషం- మీ పాటలాగ సాగాలి అనే పేరుతో ఎస్‌ పి బాలు స్వరసంస్మరణ పేరిట ఏర్పాటు చేసిన సినీసంగీత విభావరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా సంస్థ అధ్యక్షులు ముచ్చి రామలింగస్వామి, ఉపాధ్యక్షులు ఉప్పు ప్రకాష్‌లు జ్యోతిప్రజ్వలనం చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. సంస్థ సలహాదారు సముద్రాల గురుప్రసాద్‌, ప్రశాంతి సంగీత వాద్య శిక్షణా కళాశాల వ్యవస్థాపకులు ఎలిశెట్టి ్టరామమోహనరావులు మాట్లాడుతూ భారతీయ సినీ సంగీత ధృవతార బాలు అని 55 ఏళ్లపాటు నిర్విరామంగా 40 వేలపాటలకు పైగా పాడిన బాలు పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలు, నాలుగు గౌరవ డాక్టరేట్‌లు, 25 నంది అవార్డులు పొంది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఏ.గోపాలరావు , ప్రముఖ సినీ, బుల్లితెర నటులు క్రొవ్విడి జోగారావు, నంది అవార్డు గ్రహీత కొడమంచిలి సత్యప్రసాద్‌, రాయకుదురుకు చెందిన శ్రీకృష్ణదేవరాయ నాటకకళాపరిషత్‌ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ, అల్లు రమేష్‌, బాషా, బుర్రా శ్రీనివాసరావు,యుగేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు. శంబర జోగారావు, రామమోహనరావుల ఆధ్వర్యంలో మూడు గంటలపాటు జరిగిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది.

(Visited 21 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *