శ్రీక్షేత్రమ్‌లో సంకీర్తనామృతం


విజ‌య‌న‌గ‌రం:ప్రముఖ భారతీయ తత్త్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రమ్‌లో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, యుగా మ్యూజికల్స్‌ అండ్‌ రికార్డింగ్‌ స్టూడియో సంయుక్తంగా నిర్వహించిన సంకీర్తనామృతం అలరించింది. మహాగణపతిం, శ్రీ గణనాథం అంటూ వినాయక ప్రార్థనా గీతాలతో ప్రారంభమై కులుకగ నడవగా, భావములోన, చూడరమ్మ సతులాలా, భావయామి, శరణుశరణు, వేడుకుందామా, గురుతెరిగిన, పిడికిట తలంబ్రాలు, తందనానా, నారాయణతే, తిరు తిరుజవరాల తదితర కీర్తనలతో వోలేటి శ్రీకాంత్‌, వనపర్తి శ్రీను, సూర్యరత్నం, పుష్ప, మహేశ్వరరావులు అలరించారు. సందీప్‌, కృష్ణతేజ, రమ్య, గగన,శృతి, శ్రీహితలు తమ గాత్రంతో ఆలరించారు.మృదంగంపై గణేష్‌, వయోలిన్‌పై సాయి సహకారాన్ని అందించారు. ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు గురు ప్రసాద్‌, శ్రీక్షేత్రమ్‌ ధర్మకర్తలు దుర్గాబాలాజీ, ఉమాదేవి దంపతులు గాయనీ గాయకులను ఉచిత రీతిని సత్కరించి అభినందించారు.

(Visited 19 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.