నీలిమా భాస్కర్‌ను ఆశీర్వదించండి
ఎంపీ భీశెట్టి సత్యవతి
అనకాపల్లి : 80వ వార్డు వైఎస్సార్ కొణతాల నీలిమా భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు భీశెట్టి సత్యవతి, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, జీవీఎంసీ అనకాపల్లి ఎన్నికల పరిశీలకులు దాడి జయవీర్ లతో పాటు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికలలో నా కుమార్తె కొణతాల నీలిమ భాస్కర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ఇంట్లో మనిషిగా మీ కష్టసుఖాలలో తోడుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మహిళలకు సముచిత స్థానం ఇచ్చి మనల్ని ఎంతో గౌరవిస్తున్నారని కాబట్టి మన ప్రభుత్వం తరుపున కార్పొరేషన్ బరిలో 80వ వార్డ్ నుంచి పోటీ చేస్తున్న నీలిమని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
శాసన సభ్యులు అమర్నాథ్ మాట్లాడుతూ సోదరి నీలిమ విజయాన్ని కాంక్షిస్తూ సోదరి నీలిమని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మీదని మన ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని మన సంక్షేమ పథకాలు చూసి ప్రత్యర్డుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అందుకే కళ్ళబొల్లి మాటలు ఆడుతున్నారని మన ప్రభుత్వం అధికారంలో వుంది కాబట్టి మన ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను మనం తప్పక గెలిపించుకోవాలని నన్ను ఎలా అయితే అత్యధిక మెజారిటీతో గెలిపించారో అంతకుమించిన మెజారిటీతో సోదరి నీలిమని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి 80వ వార్డ్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు.రత్నాకర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో ముందున్న మన ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అందించాలంటే సోదరి నీలిమని గెలిపించాలని మన గౌరవ ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని అందుకే కార్పొరేటర్ అభ్యర్థినులుగా మహిళలకే స్థానం ఇచ్చారని మన ముఖ్యమంత్రి ఇస్తున్న పథకాలు ప్రతి గడపకి ఎలాంటి అన్యాయాలకి తావులేకుండా లబ్ధిదారిని బ్యాంకు ఖాతాకే అందేలా పథక రచన చేయటం ఎంతో అభినందనీయమని ముఖ్యమంత్రి పథకాలతో మహిళలు ఎంతో ముందుకు నడుస్తున్నారని భర్తలు కూడా భార్యలపై ఆధారపడేలా మన సంక్షేమ పథకాలు ఉన్నాయని రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కూడా అందరూ మహిళామనులేనని మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం మునుపెన్నడూ చూడలేదని అన్నారు. సోదరి నీలిమని వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ గా మీరంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. జయవీర్ మాట్లాడుతూ మన ప్రభుత్వ పనితీరుని చూసి ఓర్వలేక మాయల మంత్రికులు తిరుగుతున్నారని వారి మాటల గారడీ కి ఎవరూ లొంగోద్దని వారు చేసి కుయుక్తులను త్రిప్పికొట్టి రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సోదరి నీలిమని 80వ వార్డ్ కార్పొరేటర్ అత్యధిక మెజారిటీతో గెలిపించి మాటలమాంత్రికులను గత ఎన్నికలలో ఎలా అయితే ఓడించి ఇళ్లల్లో కూర్చోబెట్టారో అలాగే ఈ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఇళ్లల్లో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, కె.ఎమ్. నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కర్రి రమేష్, కర్రి మోదినాయుడు,నగిరెడ్డి రాంబాబు,ఎర్ర సింహాద్రి,పాతుని శ్రీను,గుర్రం సత్యారావు, గొల్లవిల్లి వాసు, గొల్లవిల్లి త్రినాధ్, గొల్లవిల్లి రాజు, గొల్లవిల్లి చిరంజీవి,చెల్లుబోయిన అప్పలనాయుడు, శిమ్మ గోపి, శిమ్మ శ్రీను, ఎర్ర నాగరాజు, ఎర్ర అప్పారావు, శిమ్మ మాణిక్యం, బత్తిన గణేష్, సబ్బవరం శంకర్,కొత్తపల్లి సన్యాసిరావు,నందరపు శ్రీనివాసరావు, నందరపు ప్రభాకరరావు, కరణం తాతారావు,కోరుబిల్లి ఆరుద్ర,కర్రి అప్పాజీ,విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు, పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.