నీలిమా భాస్క‌ర్ ప్ర‌చార హోరు

వైస్సార్సీపీ యువనాయకులు దాడి జయవీర్ గారి సారథ్యంలో..


అన‌కాప‌ల్లి :స్థానిక 80వ వార్డ్ లో 80వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థిని నీలిమ భాస్కర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు..గడపగడపకి ప్రచార కార్యక్రమాన్ని విజ్ఞాన సమితి నుండి ప్రారంభమై కర్రి వారి వీధి వరకు సాగింది ఈ ప్రచారంలో భాగంగా వైసిపి నాయకులు దాడి జయవీర్ మాట్లాడుతూ పేదల కోసం జగనన్న నవరత్నాలు పధకాలను అందించి అండగా ఉంటున్నారన్నారు. వైసిపి 80 వ వార్డు అభ్యర్థిని కొణతాల నీలిమ భాస్కర్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పనిచేస్తానన్నారు. జగనన్న అందిస్తున్న సంక్చేమ పధకాలు అందరికి అందేలా చూస్తానన్నారు.రానున్న జీవీఎంసీ ఎన్నికలలో 80వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థినిగా మన కొణతాల భాస్కరరావు సతీమణి శ్రీమతి నీలిమని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ప్రచార కార్యక్రమం లో మహిళలు హరతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ,విల్లూరి శివసూరి, కర్రి శివుడు, కర్రి మోదినాయుడు, పొలిమేర మణి,కె. ఎమ్.నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,కర్రి రమేష్, విల్లూరి రామక్రిష్ణ, విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 197 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *