ప్ర‌చారంలో దూసుకుపోతున్న నీలిమా


అన‌కాప‌ల్లి : వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ బరిలో దిగిన నీలిమా భాస్క‌ర్ జ‌నం ఆద‌రాభిమానాలు పొందుతున్నారు. వార్డులో ఆమె ప్ర‌చారానికి అడుగడుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గోపాలకృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న పాత 24వ వార్డ్ లో కె. ఎమ్. నాయుడు సారథ్యంలో ప్రతి గడపకూ వెళ్లి ఓట్లు అర్థించారు. నీలిమాను క‌చ్చితంగా గెలిపించుకుంటామ‌ని స్థానికులు మాట ఇచ్చారు. మీ దంపతులను మేమే కాదు 80వ వార్డ్ లో ఉన్న అందరు తప్పక ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ఆశీర్వదించారు. మీ అందరి ప్రేమభిమానాలకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండి ప్రజాసేవలో ఉంటానని వార్డ్ అభివృద్ధికి తప్పక కృషి చేస్తానని నీలిమ భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పీలా శ్రీనివాసరావు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,మద్దాల శివనాయుడు, పెంటకోట అప్పలనాయుడు, పెంటకోట రాజా, పెంటకోట సాగర్, కాండ్రేగుల కిషోర్,పొలిమేర మణి,దాడి త్రినాధ్, కాండ్రేగుల రాము, పెంటకోట సన్యాసినాయుడు, మద్దాల సురేష్, కొణతాల మహాలక్ష్మి ప్రసాద్, బుద్ద రమణాజీ,వేగి త్రినాధ్,కర్రి రుద్రి, వాసుపల్లి తాతీలు, చదరం పరమేశ్వరరావు,విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్, ఆళ్ళ చంటి మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 83 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *