జాతరకు డ్రోన్ కెమెరాలతో నిఘా. ఏఎస్ పి తుషార్ డూడి

(అల్లూరి సీతారామరాజు జిల్లా)

చింతపల్లి :

స్థానికంగా జరిగే ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు

చోటు చేసుకోకుండా ప్రత్యేక భద్రతతో పాటు నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్ పి తుషార్ డూడి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి సమాచారం కలగకుండా పంచాయతీ, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్య కూడళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జాతరకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వదిలిపెట్టమన్నారు. జాతరకు ప్రత్యేక బలగాలను మోహరించి భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. జాతరలో అసాంఘిక శక్తులు చొరబడి ఇష్టానుసారం ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

(Visited 38 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.