కొత్త ఏడాది.. అంతా పాత ఏడాది

కొత్త ఏడాది

అంతా పాత ఏడాది

సారస్యం అంద‌ని రాత్రి

సారా కంపుతో రాత్రి
అండ్ ప‌గ‌లు కూడా

రంగులు వ‌గ‌లు పోతున్నాయి
మా క‌ర్నూలు పిల్ల ఇట్ల‌నే జెప్తాంది

రంగులు కొన్ని న‌ట‌న సంబంధితాలు
రంగులు ముఖానికి రంగులు జీవితానికి

మీరు ఎలా ఉంటే అలా ఉండాలి
ఎలా రాస్తే అలానే గ్ర‌హించే స్వీక‌ర్త‌లు ఉండాలి

చ‌దివేనో చోట కాస్త ఫిల‌సాఫిక‌ల్

మోసం ఫిల‌సాఫికల్ సిన్మా ఆప్టిక‌ల్ ఆప్టిమా కూడా

దృశ్య సంబంధ మోసం నుంచి రంగుల క‌ళ పుట్టింది

ఈ మోసం జీవితాల‌ను ఆడిస్తోంది
అత‌డి మోసం సినిమా క‌థ‌ను న‌డిపిస్తోంది

అండ్ ద ఫిల్మ్ టైటిల్ ఈజ్ బ్ల‌ఫ్ మాస్ట‌ర్

రాస్తున్నానొక మార్నింగ్ రాగా

మార్నింగ్ రాగా : బ‌్ల‌ఫ్ ఇన్ ద సెన్స్

ఫ‌స్ట్ కాజ్ : బ‌్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా చూస్తూ చూస్తూ

మ‌నుషులంతా ఎలా ఉన్నారు ప్రేమ ఎలా ఉంది కొత్త ఏడాది కొత్త ఎకో కొత్త ఎట్మా కొత్త ఎనిమీ కూడా ఏదో ఒక‌టి కానివ్వండి కానివ్వ‌క ఉండండి..మ‌న సినిమా నాలుగు కాలాలూ బ‌త‌కాలి మ‌న మోసాలూ మ‌న క‌పటాలూ క‌పాలాలు దాటి రావాలి..మ‌న సినిమా ఆలోచ‌న‌కు తావివ్వాలి..మ‌నం రాజ‌మౌళి త్రివిక్ర‌మ్ ల భ‌జ‌న‌లు ఆపితే హాయిగా ఆలోచించ‌ద‌గ్గ సినిమా మోసాల‌కూ క‌ప‌టాల‌కూ ద‌ర్ప‌ణం ప‌ట్టే సినిమా నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నాలు అంటే అలాంటివేవో వెలుగు చూస్తాయి..అయినా మ‌న‌కు చీక‌టి ఇష్టం భ‌జ‌న ఇష్టం వేషం ఇష్టం వాటితో పాటు మోసం కూడా..అంటాను సెల్యులాయిడ్ మోసం కూడా ఓ త‌ప్పిద‌మే అనికానీ ఆ క‌నిక‌ట్టు విద్యలో ఉత్తీర్ణ‌త ఎవ‌రికి వారే సాధించుకుని తీరాలి..ఫ‌ర్ దిస్ డోంట్ ఫిక‌ర్ .. మీ జీవితంలో ప్రేమ మీ జీవితంలో న‌ట‌న మీ జీవితాల‌ను క‌బ‌ళించే ఆర్థిక నేరం అన్నీ ఉండాల‌ని కోరుకుంటున్నాను ఈ వేళ .. ఈ ఏడాది అలానే ఉండాలి ఉంటుంది కూడా. ప్ర‌భువు మోసం అఫీషియ‌ల్ ప్ర‌భుత్వం మోసం అఫీషియ‌ల్ మ‌రి ఓ దొంగ ఓ స్కాములోడు ఓ సాములోరు వీరంతా ఎవ‌రు వీరూ ఆ తాను ముక్క‌లే క‌దా.. మ‌రి ప‌ట్ట‌వు మ‌న‌కు.. ఆ డేరాలో ఆ సౌధంలో కులికే క‌ల రేప‌టి మ‌న జీవితాల‌ను మార్చును.. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ చాలా చెప్పాడు .. ఇంకా చెప్పాలి కూడా .. ఇదీ నా ఆశ అండ్ ప్ర‌తిపాద‌న కూడా

అడ‌వి అంద‌మ‌యిన అబ‌ద్ధం అని చదివేను..లేదా అందాల‌ను దాచుకుని అబ‌ద్ధాల‌నూ దాచుకుని న‌డిచే ఆ ప‌చ్చ‌ని సోయ‌గాల చెంత జీవితాలు ఎలా ఉంటాయి.. ఇప్పుడ‌త‌డు ఎక్క‌డ.. మోసం ఎలా ఉంటుంది.. న‌మ్మకం ఎలా ఉంటుంది. ఏళ్ల‌కు ఏళ్లు న‌డిచే స్కాంలు ద‌గ్గ‌ర తేల‌ని కేసుల దగ్గ‌ర చ‌ట్టం ఓ ద‌గ్గ‌రి చుట్టం అయి ఉంటుంది.. ఇప్పుడ‌యినా ఎప్పుడ‌యినా మీరు ఈ మురికిని ప్రేమించాలి. రాజ‌కీయాన్ని ప్రేమించాలి..అంతుపోల‌ని గుడ్డి వాడి రాజ్యంలో గోల్డ్ వే కంపెనీలూ యామ్ వే కంపెనీల మోసాలు చిత్తగించాలి.. ఎనీవే మీరు మోస పోయాక మ‌రొక‌రిని హాయిగా మోసం చేసేందుకు సిద్ధం కండి.. మీ ఇరువురూ ప‌రస్ప‌రం మోస పోయాక క‌లిసి ఏడ్వండి లేదా న‌వ్వండి ఇదే లోకం ఇదే లోల‌కం ఇదే కాలం ఇదే గ‌మ‌నం ఇదే త‌రువాత కాలాన గ‌మ్య‌మ్ కూడా ..

మనుషుల‌కు బ‌తికే స్వేచ్ఛ ఇవ్వండి.. మ‌నుషులను చంపే అవ‌కాశం ఒక‌టి ఉందో లేదో చూడండి..మ‌న రాస్తాల్లో కొన్ని న‌కిలీలు నిజాలు.. నిజాలు న‌కిలీల పేరిట దాగిపోయిన వైనాలు…అయినా మ‌నం ఓడిపోయి ఒక్క‌డిని గెలిపిస్తాం..మ‌నం ఓడిపోయి వ్య‌వ‌స్థ‌ను తిట్టుకుంటాం.. ఇంత‌టి విప‌త్క‌రంలోనూ ప్రేమ ఉంటుంది.. ఇంత‌టి విప‌త్క‌రంలోనూ ఓడిపోతూ ఓడిపోతూ పెంచుకున్న ద్వేషం కూడా ఉంటుంది. మ‌నుషులే వీరంతా పోలీసోడూ దొంగా అండ్ ఇంకొంత మీడియా అంతా దొంగ‌లే.. అలాంట‌ప్పుడు స‌చ్ఛీల‌తలు ఆశించ‌కు.. భంగ‌ప‌డ‌కు.. ఇది న‌ది.. ఇది స‌ముద్రం అన్న గుర్తింపు నీలో లేదు.. అంతా ఒక్క‌టే నైస‌ర్గికంలో తేడాలు ఏమ‌యినా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.. న‌ది ఆత్మ ర‌క్ష‌ణ అయితే సంద్రం ఆత్మ వంచ‌న‌కు కార‌ణం అవుతుందా హా హా.. ఏమీ లేదు ఏదీ లేదు.. మీరు మీ జీవితాల్లో ఓడిపోండి.. మోస‌పోండి.. న‌మ్మి నిట్ట నిలువునా మునిగిపోండి.. మీరు కొన్ని నీడ‌ల‌ను పెంచుకుని శ‌త్రువులుగా మార్చుకోండి..లేదా తిర‌గ‌బ‌డిన కాలాల చెంత తిరుగు బాటు ప్ర‌క‌టిచండం నేర్చుకోండి.. ఎందుకో స‌త్య‌దేవ్ ప్ర‌కాశ్ రాజ్ లా ఉన్నాడు.. మ‌రి! ప్ర‌కాశ్ రాజ్ రఘువ‌ర‌న్ లా ఉంటాడు.. అంతే ఒక్క‌డే ఆర్టిస్టు.. న‌ట‌న‌కు న‌కిలీలు.. న‌కిలీలు చెంత న‌ట‌న‌లు.. ఏమ‌యినా బాగుంటాయి.. బాగున్నాయి.. విస్తృతం అయిన క‌థ .. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సీక్వెల్ చేస్తారో లేదో చూడాలిక..

న‌మ్మ‌కం తత్వం మోసం త‌ర్కం.. వెరీ సింపుల్.. నీవు మురికి నీటిలో కొద్ది సేపే ఈద‌గ‌ల‌వు అంటూ పోలీసోడు చెబుతున్నాడీ సినిమాలో ఓ చోట.. న‌వ్వేను.. ఉన్న‌దంతా మురికే అన్న గుర్తింపు పోలీసోడికి లేదు. ఉన్న‌దంతా మురికే అన్న స్పృహ ఈ పౌరుల్లోనూ లేదు.. ఓ మాట చెప్పాడు హీరో స‌ర్ నేను మోసం చేయ‌డం లేదు ఎదుటి వారు మోస పోయేందుకు ఓ అవ‌కాశం ఇస్తున్నాను అని..అంటూనే మ‌రో మాట ఇంకో చోట అంటాడు..నా ప్ర‌తి నిజంలో ఒక అబ‌ద్ధం నా ప్ర‌తి అబ‌ద్ధంలో ఓ నిజం ఉంటుంది అని… మ‌నుషులు ఈ వంచ‌న‌ను ప్రేమించాలి ప్రేమిస్తూ ఉండాలి .. ప్ర‌భుత్వాలు కూడా ఇలానే ఉన్నాయి ఉంటాయి కూడా.. బ్యాంకూ..ప్ర‌భుత్వ‌మూ ఒక్క‌టే. రెండోది క‌రెన్సీ ని సృష్టించి శాసిస్తుంది..మొద‌టిది ఆ శాస‌నంను శిరోధార్యం అని భావించి కొన్ని న‌ట‌న‌లు ప్ర‌తిపాదిత సంస్క‌ర‌ణ పేరిట తెర‌పైకి తెస్తుంది.. పోలీసోడూ దొంగోడూ ఒక్క‌డే.. దొంగోడు నాన్ యూనిఫాం పోలీసు అంతే.. ఈ పాటి లాజిక్కు స్టేష‌న్ రైట‌రుకు కూడా తెలుసు.. వెర్రి జ‌నాల‌కూ తెల్సు కానీ తెలియ‌దు అన్న స్ప‌హ లేదా స్ప‌ష్ట‌త నా చుట్టూ ఉన్న వారిలో లేదు అన‌ను..అనుకోను.

                                                                                                                                      

 

 

మ‌నిషిగా బ‌తికే హ‌క్కు కొంద‌రిదే
మ‌నిషిగా చచ్చే హ‌క్కు కొంద‌రికే
చావు బాధ్య‌త కాదు అంతిమం మాత్ర‌మే
బతుకు అంతిమం కాదు హ‌క్కు మాత్ర‌మే

(Visited 14 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.